Strawberries Benefits: స్ట్రాబెర్రీతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలు వదలరు

Benefits of Strawberries: ప్రస్తుతం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని కోసం సరైన జీవనశైలిని అలవరుచుకోవాలి. దీని కోసం మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. స్ట్రాబెర్రీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2023, 06:06 PM IST
Strawberries Benefits: స్ట్రాబెర్రీతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలు వదలరు

Health Benefits Of Strawberries:  స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పళ్లు ఎన్నో రకాల మినరల్స్, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీయాక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇందులో పోటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు అధిక మెుత్తంలో ఉంటాయి. ఈ పళ్లలో పీచు పదార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది. స్ట్రాబెర్రీలు తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా మీరు చాలా హెల్తీగా ఉంటారు. స్ట్రాబెర్రీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

స్ట్రాబెర్రీ ప్రయోజనాలు

** స్ట్రాబెర్రీలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 
** స్ట్రాబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. 
** ఈ ఫ్రూట్ నీటితోపాటు పైబర్ ను ఎక్కువ కలిగి ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. 

Also Read: Chia Seeds Side Effects: అతిగా చియా సీడ్స్‌ వినియోగిస్తున్నారా? అయితే ఇది గుర్తుంచుకోండి!

** ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు ఆజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.
** స్ట్రాబెర్రీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది  మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. 
** స్ట్రాబెర్రీ తినడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా ఇది కడుపులోని మంటను తగ్గిస్తుంది. 
** క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో స్ట్రాబెర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది. 

Also Read: Best Summer Holiday Places: సమ్మర్ లో వెళ్లాల్సిన టాప్-5 ప్రదేశాలు ఇవే...!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News