Lord Shiva: పరమశివుడి ఆ రెండు అవతారాలు ఈ భూమిపై ఇంకా జీవించే ఉన్నాయట!

Lord Shiva: లయకారుడు శివుడు. ఆయన ప్రతి కణంలోనూ ఉంటారు. కానీ శివుడి రెండు అవతారాలు ఇప్పటికీ భూమిపై సజీవంగా ఉన్నాయంట. ఈ విషయం చాలా కొద్ది మందికే తెలుసట. మరి ఆ అవతారాలేంటో ఓ లుక్కేద్దాం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 06:59 PM IST
  • శివుని 2 అవతారాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి
  • మెుదటి అవతారం పూజింపబడుతోంది
  • రెండో అవతారం శపించబడింది
Lord Shiva: పరమశివుడి ఆ రెండు అవతారాలు ఈ భూమిపై ఇంకా జీవించే ఉన్నాయట!

Avatars Of Lord Shiva: దేవతులు పరమశివుడిని (Lord Shiva) మహాదేవుడుగా పేర్కొంటారు. భక్తులు శివుడిని లయకారుడు, భూతనాథుడు, పరమేశ్వరుడు, లింగేశ్వరుడు, మహాదేవుడు, నీలకంఠుడు, గంగాధరుడు..ఇలా రకరకాల పేర్లుతో పిలుస్తారు. విష్ణువు, శివుడు అనేక అవతారాలను ధరించారు. కలియుగంలో శివుడు, విష్ణువుల అవతారాలు కూడా గ్రంధాలలో పేర్కొనబడ్డాయి. కలియుగంలో శ్రీమహావిష్ణువు కల్కిగా అవతరిస్తాడు. శివుడి యెక్కు రెండు అవతారాలు (Avatar Of Lord Shiva) ఇప్పటికీ ఈ భూమిపై సజీవంగా ఉన్నాయని ఓ కథ ప్రచారంలో ఉంది. 

ఒక అవతారం పూజింపబడుతుంది, మరొకటి శపింపబడుతుంది..
శివుని ఈ రెండు అవతారాలు హనుమంతుడు, మహాభారత యోధుడు అశ్వత్థామ. వీటిలో హనుమంతుడు పూజించబడతాడు, అశ్వత్థామ శపించబడతాడు. హనుమంతుడు (Lord Hanuman) వానరరాజు కేసరి భార్య అంజనీ గర్భంలో జన్మించాడు. డోణాచార్యుడు కఠోర తపస్సు చేసి శివుడిని తన కొడుకుగా పుట్టమని వరం కోరాడు. అందుకే అశ్వత్థామ గురువు ద్రోణాచార్యుని ఇంట్లో జన్మించాడు. పవన్‌పుత్ర హనుమంతుడు సీతను కనుగొనడానికి మొత్తం సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నప్పుడు, సీతామాత అతన్ని అమరుడిగా ఉండమని దీవించింది. అందుకే హనుమాన్ జీ ఇప్పటికీ జీవించి ఉన్నారని, ఆయన భక్తుల ఎక్కువ మంది నమ్ముతారు. 

అదే సమయంలో, మహాభారత యుద్ధంలో కౌరవులు ఓడిపోయినప్పుడు, నిద్రిస్తున్న ఉప పాండవుల ఐదుగురిని చంపాడు అశ్వత్థామ (Ashwatthama). అలాగే ఉత్తర గర్భాన్ని నాశనం చేసేందుకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామను నువ్వు భూలోకంపై శాశ్వతంగా జీవిస్తావు, సంచరిస్తూ ఉంటావు అని శపించాడు. అతను ఈ రోజుకు కూడా దట్టమైన అడవిలో ఎక్కడో సంచరిస్తున్నాడని కొందరి నమ్మకం.

Also Read: Holi 2022: హోలీ ముందురోజు ఈ సింపుల్ ట్రిక్ చేయండి... ఏడాది పొడవునా మీకు డబ్బే డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News