Kedar Yog in Kundli 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. తాజాగా కొన్ని గ్రహాల స్థానం అరుదైన కేదార్ యోగాన్ని సృష్టిస్తోంది. 7 గ్రహాలు జన్మ చార్ట్‌లోని 4 ఇళ్లలో ఉన్నప్పుడు లేదా అనేక గ్రహాలు ఒకే రాశిలో వచ్చినప్పుడు కేదార్ యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కేదార్ యోగం వల్ల ఏయే రాశులవారు శుభఫలితాలను పొందబోతున్నారో తెలుసుకుందాం.
మేషం: కేదార్ రాజయోగం మేషరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ మాటల గారడీతో పనులను పూర్తిచేస్తారు. అంతేకాకుండా ప్రజలను మీ వైపు తిప్పుకుంటారు.
కర్కాటకం: కర్కాటక రాశి వారికి కూడా కేదార రాజయోగం మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు స్థిర చరాస్తులు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రస్తుతం జాబ్ చేసేవారు ఇంకా పెద్ద స్థాయికి వెళ్లవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు.
Also Read: Lucky Zodiac Sign: వినాయకుడికి ఇష్టమైన రాశులివే.. వీరికి దేనికీ లోటు ఉండదు..
మకరం: కేదార్ రాజయోగం మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మకర రాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
Also Read: Budh Uday 2023: కర్కాటక రాశిలో ఉదయించబోతున్న బుధుడు..ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook