Mercury Transit 2024: మేషరాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారి భవిష్యత్తు పూర్తిగా మారబోతోంది..

Mercury Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం మార్చి 26వ తేదీన మేషరాశిలోకి సంచారం చేయబోతోంది ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే ఏయే రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 21, 2024, 09:38 PM IST
Mercury Transit 2024: మేషరాశిలోకి బుధుడు.. ఈ రాశుల వారి భవిష్యత్తు పూర్తిగా మారబోతోంది..

 

Mercury Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు వ్యక్తుల జాతకాల్లో ప్రత్యేక స్థానంలో ఉంటే, జీవితంలో మేధస్సు, కమ్యూనికేషన్, గణితం, తెలివి, స్నేహం, బాధ్యతలకు ఎలాంటి డోకా ఉండదు. బుధ గ్రహం సంచారం చేయడం కారణంగా కూడా కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రహం ప్రతినెల తన రాశిని మార్చుకుంటూ.. ఇతర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే ఈ నెల 26వ తేదీన బుధుడు మరోసారి రాశి సంచారం చేయబోతున్నాడు. బుధుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనికి కారణంగా ఈ గ్రహం కొందరి జాతకాల్లో శుభస్థానంలోకి వెళ్లబోతోంది. ఈ బుధ గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అదృష్టం కలిసి రావడమే కాకుండా విపరీతమైన డబ్బును పొందుతారు. అయితే ఈ బుధుడు సంచారం చేసే క్రమంలో ఏయే రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మేషరాశి:
మార్చి 26వ తేదీన జరిగే బుధ గ్రహ సంచారం కారణంగా మేష రాశి వారికి చాలా రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు కూడా వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ జీవితం కూడా చాలా మధురంగా ఉంటుంది. అలాగే ఎప్పటినుంచో వస్తున్న సమస్యలకు బుధుడి అనుగ్రహం కలిగి పరిష్కారం లభిస్తుంది. దీంతోపాటు ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

మిధున రాశి:
మిధున రాశి వారికి భూత గ్రహ సంచారం కారణంగా అనేక శుభ ఫలితాలతో పాటు ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి సంతోషంతో పాటు శ్రేయస్సు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో వారి కోరిక నెరవేరబోతోంది. అలాగే కష్టపడి పనిచేసే వారికి ఆఫీసుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. దీంతో పాటు వీరు కొత్త బాధ్యతలను కూడా పొందుతారు. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో భాగస్వామితో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం వ్యాపారాలు చేస్తున్న వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ కొత్త బాధ్యతలను కూడా నిర్వర్తించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కష్టమైన పనుల్లో కూడా ఈ సమయంలో సులభంగా విజయాలు సాధిస్తారు. వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం శృంగారభరితంగా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రణాళికలతో ముందుకెళ్లడం వల్ల మంచి మంచి అవకాశాలు పొందుతారు. దీంతోపాటు వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News