Budh Gochar 2023 effect: వచ్చే నెలలో బుధుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. జూన్ 7వ తేదీ రాత్రి 07.58 గంటలకు బుధుడు తన స్నేహితుడైన శుక్రుని ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. వృషభరాశిలో మెర్క్యూరీ జూన్ 24 వరకు ఉంటాడు. అనంతరం మిథునరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. ప్రస్తుతం బుధుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. వృషభరాశిలో బుధుడి సంచారం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా రెండు రాశులవారిపై చెడు ప్రభావం చూపనుంది.
ఈ రాశులవారు జాగ్రత్త
మిథునం: వృషభరాశిలో బుధుడి సంచారం వల్ల మిథునరాశివారికి కష్టాలు మెుదలకానున్నాయి. మీ పని చెడిపోయే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. మీరు కెరీర్ లో అనేక సమస్యలను ఎదుర్కోంటారు. మీరు ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈ టైంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమయలో మీరు వినాయకుడిని పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
సింహం: వృషభరాశిలో మెర్క్యురీ సంచారం సింహరాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. మీరు బిజినెస్ లో భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిలో అపజయమే ఎదురవుతుంది. ఇది పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం కాదు. మీ హెల్త్ చెడిపోయే అవకాశం ఉంది. ఈ టైంలో మంచి డైట్ ఫాలోయితే మీకే మంచిది. బుధవారం ఉపవాసం ఉండి ఓం బ్రాం బ్రిం బ్రౌం సః బుధాయ నమః అనే బీజ మంత్రాన్ని జపించడం మంచిది. అంతే కాకుండా శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల కూడా శుభం జరుగుతుంది.
Also Read: Second Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఎప్పుడు? ఇది భారతదేశంలో కనిపిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.