Navpancham Rajyog 2023: చాలా రోజుల తర్వాత అరుదైన నవపంచం యోగం, ఈ రాశులవారికి అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయిట..

Navpancham Rajyog 2023: నవపంచం యోగం కారణంగా చాలా రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ కింది రాశులవారికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 28, 2023, 09:40 AM IST
Navpancham Rajyog 2023: చాలా రోజుల తర్వాత అరుదైన నవపంచం యోగం, ఈ రాశులవారికి అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయిట..

Navpancham Yoga 2023: జ్యోతిష్య శాస్త్రంలో అనేక రకాల రాజయోగాల గురించి వివరించారు. ఈ యోగాలు గ్రహాలు సంచారం చేసిప్పుడు, ఒకే రాశిలో కొన్ని గ్రహాల కలయిక కారణంగా ఏర్పడతాయి. ప్రత్యేక యోగాలు మాత్రం గ్రహాలు వాటి స్థాలను బట్టి ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుజుడు ప్రస్తుతం మిథునరాశిలో ఉన్నాడు. అయితే కుంభరాశిలో శని గ్రహం సంచార క్రమంలో ఉంది. అతి త్వరలోనే ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి. ఈ కలయిక కారణంగా నవపంచం యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనుకున్నవి జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ యోగం ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై నవపంచం యోగం ప్రభావం:
మేష రాశి:

నవపంచం యోగం ప్రభావం కారణంగా ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ఈ క్రమంలో ధైర్యం, శక్తి రెట్టింపు అవుతుంది. ఇలా చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. ఐటీ రంగంలో పనులు చేసేవారికి మరింత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

కన్య రాశి:

కన్య రాశివారిపై నవపంచం యోగం ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్స్‌ కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో కష్టపడి పని చేసేందుకు ప్రయత్నించాలి. కంపెనీల్లో పని చేసేవారికి మీ బాస్‌ ఏవైనా పనులు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రముఖ కంపెనీల నుంచి ఉన్నత స్థాయి స్థానాలకు ఆఫర్లు రావచ్చు. పనుల్లో అడ్డంకులు ఉన్నవారికి ఈ క్రమంలో తొలగిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ యోగం కారణంగా సమాజంలో గౌరవం పెగుతుంది. అంతేకాకుండా మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. వీరు ఆఫీసుల్లో మంచి పేరు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కీర్తి పెరిగి, వ్యాపారాల్లో అనుకున్న లాభాలు కూడా పొందుతారు. స్నేహితులు, తోబుట్టువుల సహాయంతో అన్ని రకాల పనులు సులభంగా చేయగలుగుతారు. ఆర్థిక సమస్యల నుంచి కూడా కోలుకుంటారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News