Sankranthi Muggulu: సంక్రాంతి రోజు ముగ్గులు పెట్టుకోకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పురాణాలు చెబుతున్నవి ఇవే!

Sankranthi Muggulu: సంక్రాంతి ముగ్గులకు పురాణాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి రోజు ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గులు పెట్టుకుంటారు. వారింటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 09:28 PM IST
Sankranthi Muggulu: సంక్రాంతి రోజు ముగ్గులు పెట్టుకోకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పురాణాలు చెబుతున్నవి ఇవే!

Sankranthi Muggulu: సంక్రాంతి పండగను తెలుగు రాష్ట్ర ప్రజలు మూడు రోజుల పాటు జరుపుకుంటారు.. సంక్రాంతి ముందు రోజు నుంచే పల్లె ప్రాంతాలలో భోగి మంటలు, బసవన్నల సందడులు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఇలా మూడు రోజులపాటు ఎంతో సందడిగా కొనసాగుతుంది. ఇక మహిళలైతే ఈ సమయంలో ఉదయం పూట ఎంతో బిజీ బిజీగా ఉంటారు. ముగ్గులు పెట్టడం నుంచి మొదలుకొని గొబ్బెమ్మలు తయారు చేయడం, ముగ్గులను బంతిపూలతో అలంకరించడం ఇలా మహిళలు చాలా బిజీగా ఉంటారు.

ఇక మకర సంక్రాంతి రోజు అయితే మహిళలు వారిలో ఉన్న క్రియేటివిటీ మొత్తం ముగ్గుల రూపంలో బయటపడుతూ ఉంటారు. అందమైన ముగ్గులు వేయడమే కాకుండా ఆకర్షనీయంగా కనిపించేందుకు రంగులను కూడా నింపుతూ ఉంటారు. అసలు మకర సంక్రాంతి రోజు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా.? ముగ్గులు వేయకుంటే ఏం జరుగుతుంది అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం?

ముగ్గులు ఎలా వేస్తారు:
గ్రామాల్లో నైతే చాలావరకు ముగ్గులను మట్టి నేలపై పూర్తిగా బియ్యప్పిండితో గీస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే ముగ్గుల పిండిని ముందుగానే సిద్ధం చేసుకుని ముగ్గులను పెడతారు. ఇక పట్టణాల్లో నైతే మట్టి నేల కనిపించదు.. కాబట్టి ఫ్లోరింగ్ పై చాక్​పీస్​తో వేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఫ్లోరింగ్ పై కూడా బియ్యప్పిండి ముగ్గుల పిండితో వేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు వారికి అందుబాటులో ఉన్న వాటితో ముగ్గులను వేస్తూ ఉంటారు. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

సంక్రాంతి పండగ రోజున చాలామంది ఎక్కువగా చుక్కల ముగ్గులను వేస్తూ ఉంటారు. అందరూ ఎక్కువగా వేసే ముగ్గులలో ఐదు చుక్కల ముగ్గు ఒకటి.. దీంతోపాటు రథాలు, గంగిరెద్దు, పాలు పొంగడం, బసవన్నల ముగ్గులను కూడా వేస్తూ ఉంటారు. ఇలా ముగ్గులను వేసి రంగులతో అలంకరిస్తారు. అంతేకాకుండా గొబ్బెమ్మలను తయారుచేసి పెడతారు. అయితే కొంతమంది బద్ధకంగా ఉండి ముగ్గులు పెట్టడం మానుకుంటారు. అసలు సంక్రాంతి పండగ రోజున ముగ్గులు పెట్టకపోతే ఏం జరుగుతుంది? పూర్వికులు ఏం చెబుతున్నారు?

సంక్రాంతి రోజు ముగ్గులు పెట్టకపోతే ఏం జరుగుతుంది?:
పురాణాల్లో సంక్రాంతి రోజు ముగ్గులు లేకపోతే ఏం జరుగుతుందో కూడా వివరించారు. సంక్రాంతి పండగ రోజు ఎవరి ఇంటి ముందు అయితే ఉదయం పూట ముగ్గులు పెట్టుకోవడం వారి ఇంటికి లక్ష్మీదేవి రాదని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ పండగ రోజు ఉదయం పూట సాక్షాత్తు లక్ష్మీదేవి వీధుల్లోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి రోజు ఎవరైతే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వచ్చి ఆశీర్వదిస్తుందట. అంతేకాకుండా ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయ. కాబట్టి ప్రతి ఒక్కరు సంక్రాంతి మూడు రోజులపాటు తప్పకుండా ముగ్గులు పెట్టుకోవాలి.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News