Vish Yoga In Kundli: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిచక్రాలను మారుస్తాయి. దీని వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పరుస్తున్నాయి. జనవరి 17న శనిదేవుడు కుంభరాశిలో సంచరించాడు. చంద్రుడు కూడా అదే రాశిలో ప్రయాణిస్తున్నాడు. శని, చంద్రుల కలయిక వల్ల అరుదైన విషయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా అశుభకరమైనదిగా భావిస్తారు. కాబట్టి ఈయోగం వల్ల 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటక రాశిచక్రం (Cancer)
ఈ యోగం మీకు కొంత బాధను కలిగిస్తుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఎనిమిదవ ఇంట్లో శని, చంద్రుల కలయిక ఏర్పడుతోంది. అందుకే ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు. చర్చలకు దూరంగా ఉండండి. ఉద్యోగం మారాలనే ఆలోచన మానుకోండి. ఈసమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి శనిదేవుడితోపాటు మహాదేవుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
మీన రాశిచక్రం (Aries)
విష యోగం మీకు హానికరం. ఎందుకంటే మీ రాశి నుండి 12వ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. అందుకే ఈ సమయంలో అనవసర ఖర్చులు తగ్గించుకోండి. మీ ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. మీరు ఈ సమయంలో ఏ పనిని మెుదలుపెట్టకండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయంకడి. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
కన్య రాశిచక్రం (Virgo)
విష యోగం మీకు అశుభకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఆరవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. దీని కారణంగా కోర్టు కేసుల్లో అపజయం ఎదురవ్వచ్చు. ప్రయాణాలకు దూరంగా ఉండండి. ట్రావెలింగ్ లో మీ లగేజీని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారులు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.
Also Read: Raj Panchak: 'రాజ్ పంచక్' మొదలైంది.. ఈ పనులు చేస్తే మీకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook