Venus transit in Aries 2022: మరో మూడు రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శుక్రుడు మే 23వ తేదీ రాత్రి 08:39 గంటలకు మేషరాశిలోకి (Venus transit in Aries 2022) ప్రవేశిస్తాడు. శుక్రుడి రాశిచక్రంలో మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తే..మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శుక్రుని సానుకూల ప్రభావంతో, ఆదాయంలో పెరుగుదల, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో పురోగతి, ప్రేమ వివాహం, ప్రేమలో పెరుగుదల మొదలైనవి కనిపిస్తాయి. అయితే శుక్రుడి ప్రతికూల ప్రభావం ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు మరియు దుబారా కూడా పెరుగుతుంది. శుక్రుడు రాశి మారడం వల్ల ఏ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం (Taurus): శుక్రుని రాశిలో మార్పు వృషభ రాశి వారికి దుబారాను పెంచుతుంది. దీని కారణంగా ఆర్థిక పరిస్థితికి ఆటంకం ఏర్పడవచ్చు. ఖర్చులు పెరగడం వల్ల పొదుపు దెబ్బతింటుంది. శుక్ర సంచారం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి.
కన్య (Virgo): మేషరాశిలో శుక్రుని సంచారం మీ కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీ తండ్రి ఆరోగ్యం క్షీణించవచ్చు, అతని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లితో గొడవపడకండి, లేకపోతే సంబంధం దెబ్బతినవచ్చు. ఏదైనా విషయంలో సందిగ్ధత ఉంటే, మీరే క్లారిటీ ఇవ్వండి, లేకపోతే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.
వృశ్చికం (Scorpio): శుక్రుని సంచారం వల్ల వృశ్చిక రాశి వారు వృత్తి లేదా వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో సవాళ్లు పెరుగుతాయి. మీకు హాని కలిగించే ప్రయత్నం ఉండవచ్చు, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార సంబంధిత నిర్ణయాలలో గోప్యత పాటించండి.
మీనం (Pisces): శుక్రుని సంచారం కారణంగా, ఈ రాశికి చెందిన వారు కుటుంబ సంబంధాలలో హెచ్చు తగ్గులు చూడవచ్చు. కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాల వల్ల ఆర్థిక భారం మీపై పడవచ్చు. ఈ కారణంగా, ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఈ కాలంలో మీరు దుబారాను నియంత్రించవలసి ఉంటుంది. అవగాహన లోపం వల్ల వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.
Also Read: Thursday Tips: గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఈ పనులు చేయకూడదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook