Shukra Gochar 2023: మే ప్రారంభంలో సంపద, శ్రేయస్సు, విలాసానికి కారకుడైన శుక్ర గ్రహం తన రాశిని వదిలి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం మే 2న జరగబోతోంది. అయితే మిథున రాశిలోకి శుక్రుడు సంచారం వల్ల పలు రాశులవారిపై ప్రభావం పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శుక్రుడు సంచారం వల్ల పలు రాశులవారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులవారికి దుష్ప్రభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి శుక్ర గ్రహ ప్రభావం:
కుంభ రాశి:
శుక్రుడు మిథున రాశిలోకి సంచారం చేయడం వల్ల కుంభ రాశివారికి మనస్సు చంచలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబ జీవితం బాధాకరంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సంచారం వల్ల దుబారా ఖర్చులు కూడా పెరుగుతాయి.. కావున ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సింహ రాశి:
ఈ సంచారం కారణంగా సింహ రాశివారికి కోపం పెరుగుతుంది. ఈ క్రమంలో ఉద్యోగ బదిలీలు జరిగే ఛాన్స్ కూడా ఉంది. తండ్రితో సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుడా మాటలను అదుపులో ఉంచుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా భావోద్వేగాలు పెరుగుతాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవడం చాలా మేలు.
వృచ్చిక రాశి:
వృచ్చిక రాశి వారికి శుక్ర గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయడం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో సంభాషణలో సమతుల్యతను కాపాడుకోండి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది. కార్యాలయంలో మరింత కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి.. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మకర రాశి:
మకర రాశి వారిపై కూడా గ్రహ సంచార ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చు. వీరు ఇతరుల పట్ల నమ్మకంగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టడం వల్ల నష్టాలు కలుగొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.