Sun Transit In Libra 2022 effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా, దాని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. రీసెంట్ గా అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి (Sun transit in Libra 2022) ప్రవేశించాడు. తులరాశిని పాలించే గ్రహం శుక్రుడు. ఇతడు ప్రేమ, శృంగారం, సంపద, లగ్జరీ లైఫ్ కు కారకుడు. శుక్రుడు, సూర్యుడు శత్రువులు. అలాంటి శుక్రుడి రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అనేది అశుభఫలితాలను ఇస్తుంది. కానీ ఈ సమయంలో కూడా కొన్ని రాశులవారు శుభఫలితాలను పొందుతారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు శుభప్రదం
మిథునం (Gemini)- ఈ రాశి యెుక్క ఐదో ఇంట్లో సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో సంతానం లేని ఈ రాశి దంపతులకు పిల్లలు కలుగుతారు. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ప్రేమ సంబంధాలు బాగుంటాయి. మీకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మిథునరాశికి అధిపతి బుధుడు. సూర్యుడు, బుధుడు మంచి మిత్రులు. దీంతో ఈ రాశివారికి సూర్య సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది.
వృషభం (Taurus)- సూర్యుడి రాశిమార్పు ఈ రాశివారికి మేలు చేస్తుంది. ఈ రాశి యెుక్క ఆరో ఇంట్లో సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో ఈ రాశివారికి ధైర్యం పెరుగుతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారం ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మణి రత్నాన్ని ధరించడం వల్ల ప్రయోజనం పొందుతారు.
Also read: Solar Eclipse 2022: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూసివేత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook