Surya Dev: సూర్య గోచారం వల్ల ఈరాశులకు గోల్డెన్ డేస్.. ఇందులో మీరున్నారా?

Surya Gochar 2023: సూర్యభగవానుడు మకర సంక్రాంతి రోజున తన రాశిని మార్చాడు. దీంతో కొందరికి గోల్డెన్ డేస్ మెుదలయ్యాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2023, 12:23 PM IST
Surya Dev: సూర్య గోచారం వల్ల ఈరాశులకు గోల్డెన్ డేస్.. ఇందులో మీరున్నారా?

Surya transit benefits: మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో సంచరించాడు. సూర్యుడి రాశి మార్పు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఆత్మ, గౌరవానికి ప్రతీకగా సూర్యభగవానుడిని భావిస్తారు. ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. సూర్య గోచారం వల్ల మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం మరియు మకర రాశులవారు లాభపడనున్నారు. 

సూర్య సంచారం ఈ రాశులకు వరం
మిధున రాశి (Gemini): సూర్య సంచారం వల్ల మిథునరాశి వైవాహిక జీవితం అద్బుతంగా ఉంటుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. 
కర్కాటకం (cancer): ఈ రాశి వారికి వ్యాపారంలో లాభం ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. 
తులారాశి (Libra): సూర్యగోచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రత్యర్థులు మీ వల్ల ఓడిపోతారు. ఆరోగ్యం మెరుగువుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టడం వల్ల లాభం పొందుతారు. 

వృశ్చిక రాశి (Scorpio): మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో లాభాలు ఉంటాయి. మీరు డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. కొత్త కారు లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది.
మకర రాశి (Capricorn): సూర్యుడు మకరరాశిలో సంచరించాడు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కల ఫలిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. విద్యారంగంతో అనుబంధం ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

Also Read: Mercury Planet: కుంభరాశిలోకి వెళుతున్న బుధుడు.. ఈ 3 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News