Sun Transit 2023 effect: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజుగా పిలుస్తారు. రీసెంట్ గా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. మే 15 వరకు భానుడు ఆదే రాశిలో సంచరించనున్నాడు. ఆదిత్యుడు బుధుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నాడు. అంతేకాకుండా మేషరాశిలో రాహు, గురు, యురేనస్ కలిసి ఉండటం వల్ల పంచగ్రహి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం: ఇదే రాశిలో సూర్యుడు సంచారం వల్ల మీకు మేలు జరుగుతుంది. బుధాదిత్య యోగం ఈ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది.
మిథునరాశి: సూర్యుడి రాశి మార్పు మిథునరాశివారికి బాగుంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విదేశాల నుండి ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం: సూర్య గోచారం కర్కాటక రాశి వారికి వృత్తిలో పురోగతిని ఇస్తుంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విదేశాల్లో చదువు కోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. లవ్ లైఫ్ బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
Also Read: Guru Rahu Yuti 2023: 36 ఏళ్ల తర్వాత గురు-రాహువుల కలయిక.. వీరి జీవితం అల్లకల్లోలమే ఇక..
సింహ రాశి: సూర్యుడు సింహ రాశికి అధిపతి. మీరు ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి సూర్య సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆదాయం డబల్ అవుతుంది. లవ్ లైఫ్ బాగుంటుంది.
Also Read: Chandra Grahan 2023: మే 05న తొలి చంద్రగ్రహణం.. ఇది ఇండియాలో కనిపిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook