These 4 zodiac signs will get golden days from 14th January 2023 due to Sun Transit in Capricorn 2023: 2023 సంవత్సరం ప్రారంభమైంది. చాలా ముఖ్యమైన గ్రహాలు మొదటి నెల జనవరిలోనే సంచరిస్తున్నాయి. జనవరి 14న గ్రహాల రాజు 'సూర్యుడు' తన రాశిని మార్చనున్నాడు. 2023 జనవరి 14న మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. శని ఇప్పటికే మకర రాశిలో ఉండగా.. సూర్యుడు కూడా జతవనున్నాడు. శనితో సూర్యుడు స్నేహభావంగా ఉంటాడు కాబట్టి.. సూర్య సంచారం ఈ నాలుగు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది.
సూర్యుని సంచారం 2023 జనవరి 14 రాత్రి జరిగినప్పటికీ.. ఉదయతిథి ప్రకారం మకర సంక్రాంతిని 2023 జనవరి 15న జరుపుకుంటారు. సూర్య సంచారం వలన ఏ నాలుగు రాశుల వారు బలమైన ప్రయోజనాలను పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, మకర రాశి ప్రజలు సూర్య సంచారం 2023 వలన చాలా ప్రయోజనం పొందనున్నారు.
వృషభం:
సూర్యుని సంచారం వృషభ రాశి వారికి సంవృత అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీ పని అందరిచే ప్రశంసించబడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృషభ రాశి వారికి అదృష్టం వెనకాలే ఉంటుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది.
మిథునం:
సూర్యుని రాశి మార్పు మిథున రాశి వారి ఆర్థిక స్థితిని మెరుగుపర్చుతుంది. ఈ రాశి వారి డబ్బు కష్టాలు తొలగిపోతాయి. మంచి జరగడం ప్రారంభమవుతుంది. కెరీర్‌లో ఒత్తిడి పూర్తిగా దూరమవుతుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారం మంచి సమయాన్ని తీసుకొస్తుంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారు లాభపడగలరు. విహారయాత్రకు వెళ్లవచ్చు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది.
మకర రాశి:
మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి విశేష ప్రయోజనాలు చేకూరుతాయి. మకర రాశిలో శనితో సూర్యుడు ఉంటాడు. దాంతో మకర రాశి వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇప్పటివరకు అనుభవించిన శారీరక మరియు మానసిక సమస్యలు తొలగిపోతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.