Mercury Transit 2023: ఫిబ్రవరి 27న కుంభ రాశిలోకి బుధుడు.. ఈ 7 రాశుల వారికి ఇక డబిడదిబిడే!

These 7 Zodiac Signs will have troubles from February 27 due to Budh Gochar 2023. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం బుధ గ్రహం మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 27, 2023, 09:34 PM IST
  • ఫిబ్రవరి 27న కుంభ రాశిలోకి బుధుడు
  • ఈ 7 రాశుల వారికి ఇక డబిడదిబిడే
  • రుణం తీసుకునేటప్పుడు జాగ్రత్త
Mercury Transit 2023: ఫిబ్రవరి 27న కుంభ రాశిలోకి బుధుడు.. ఈ 7 రాశుల వారికి ఇక డబిడదిబిడే!

These 7 Zodiac Signs will face troubles from February 27 due to Mercury Transit in Aquarius 2023: ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన రాశిని మార్చుకుంటూనే ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సంచారం మొత్తం మానవాళిని ప్రభావితం చేస్తుంది. సంపద, వ్యాపారం, తెలివితేటలు, తర్కం, సంభాషణలకు కారకంగా బుధుడు పరిగణించబడుతుంది. బుధుడు రాశిని మార్చినప్పుడల్లా.. కొన్ని రాశుల వ్యక్తుల వృత్తి, ఆర్థిక స్థితి, మాట తీరుపై ప్రభావం ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం బుధ గ్రహం మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. బుధుని ఈ రాశి మార్పు కొన్ని రాశిచక్ర గుర్తులకు అనువుగా ఉంటుంది. మరికొందరికి మాత్రం అశుభంగా ఉంటుంది. ఆ రాశులను ఇప్పుడు చూద్దాం. 

మేషం:
మేష రాశి వ్యాపారులు బ్యాంకు, ఏదైనా ఆర్థిక సంస్థ లేదా వ్యక్తి నుంచి రుణం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు పొందే డబ్బు మంచి ప్రణాళిక మాత్రమే మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

వృషభం:
వృషభ రాశికి చెందిన వ్యక్తులు తమ పనిలో సాంకేతికతను ఉపయోగించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. సాంకేతికతను ఉపయోగించడం వల్ల ప్రతి పనిలో ఆనందం మరియు సౌలభ్యం కూడా వస్తుంది.

మిథునం:
మిధున రాశి వారు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే అదృష్టం కూడా తోడ్పడుతుంది. కుటుంబ వ్యాపారం చేసే వారు దాన్ని పెంచుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల ఫలితాలు బాగుంటాయి.

సింహం:
సింహ రాశి వారు తమ జీవిత భాగస్వామికి సహకరిస్తే.. వారు బాగా అభివృద్ధి చెందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో కొత్త భాగస్వాములు కూడా చేరవచ్చు.

కన్యా:
కన్యా రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం మీరు యోగా-ప్రాణాయామం చేయాలి. రుణం తీసుకోవడం ఈ సమయం సరైనది కాదు. వైద్య రంగంలోని వ్యక్తులు లాభాల్లో ఉంటారు. పోటీ ఆప్రేక్షలకు సిద్ధమవుతున్నవారు బాగా సిద్ధం కావాలి.

తులా:
తులా రాశి విద్యార్థులు కష్టపడి పని చేసిన తర్వాత మాత్రమే విజయం సాధిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి. బాబా, తండ్రి మరియు ఇతర పెద్దల ఆశీస్సులు పొందండి. 

మకరం:
మకర రాశి వారు తమ మాటల్లో మాధుర్యాన్ని, వినయాన్ని నేర్చుకోవాలి. మకర రాశి వారు తమ మాటలతో ఎవరినీ నొప్పించకూడదు.  వ్యాపారంలో కూడా లాభదాయకంగా ఉంటుంది. మీరు నిగ్రహాన్ని కోల్పోకూడదు. 

Also Read: Surya Grahan 2023: 2023లో మొదటి సూర్య గ్రహణం.. భారతదేశంపై ప్రభావం చూపుతుందా? పూర్తి వివరాలు ఇవే

Also Read: Saturn Rise 2023: కాముని దహనానికి ముందు శని ఉదయం.. ఈ రాశుల వారికి భారీ లాభాలు! లెక్కలేని సంపద

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

Trending News