Tirumala temple festivals list: ప్రముఖ పుణ్య క్షేత్రాలలో తిరుమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య కొంతమేరకు భక్తుల రద్దీ తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా ప్రతిరోజు హుండీ ఆదాయమే రూ .3కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వామివారికి సర్వదర్శనం కోసం ఎనిమిది నుంచి పది గంటల సమయం మాత్రమే పడుతున్నట్లు భక్తులు తెలియజేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో సైతం నిర్వహించే పర్వదినాలు, ఇతర ఉత్సవాలకు సంబంధించిన ప్రతి విషయాలను కూడా తెలియజేశారు టీటీడీ అధికారులు.
ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి తో ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి. అలాగే 26వ తేదీన మహాశివరాత్రి తో ముగుస్తున్నాయట. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని చేయబోతున్నట్లు టీటీడీ అధికారులు తెలుపుతున్నారు. భక్తుల రద్దీను ముందుగానే అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారట.
ఫిబ్రవరి 5వ తేదీన భీష్మాష్టమి, ఫిబ్రవరి 6వ తేదీన మధ్వనవమి, 8వ తేదీన భీష్మ ఏకాదశి, 12వ తేదీన శ్రీరామ కృష్ణ తీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ , 24వ తేదీన సర్వ ఏకాదశి, 26వ తేదీన మహాశివరాత్రి వంటి పండుగలను నిర్వహించబోతున్నారట.
అయితే గతంలో లాగా కాకుండా ఈసారి పూర్తిగా భక్తుల రద్దీని సైతం ముందుగానే గ్రహించి ట్రాఫిక్ పార్కింగ్ ప్రత్యేకమైన దృష్టి ఉంచేలా సమగ్ర బందోబస్తును సైతం ఉంచేలా టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తతో చూసుకుంటున్నారట. అలాగే వాహనాల రాకపోకలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు హెచ్చరిస్తున్నారట.
ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగిన భాగంగా కొంతమంది మరణించారు. అప్పటినుంచి ఇలాంటి వాటి పైన టీటీడీ సిబ్బంది ప్రత్యేకమైన దృష్టి సాధించబోతున్నట్లు సమాచారం. ఇక మీదట అలాంటివి జరగకుండా చూసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా తిరుమల లో భక్తుల రద్దీని అదుపు చేయడానికి అధికారులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
Also Read: Prakash Raj Kumbha Mela: కుంభమేళాలో ప్రకాష్ రాజ్ పుణ్య స్నానాలు.. స్పందించిన నటుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.