IND vs SA: స్వదేశంలో టీమిండియా జోరు మీద ఉంది. వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. టీ20ల్లో డెత్ ఓవర్ల సమస్య వెంటాడుతున్నా..బ్యాటింగ్ బలంతో దూసుకెళ్తోంది. తాజాగా మరో సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. రేపటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ తిరువనంతపురం వేదికగా జరగనుంది. రేపు(బుధవారం) సాయంత్రం 7 గంటకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఈసిరీస్ నుంచి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ భువనేశ్వర్‌కు విశ్రాంతిని ఇచ్చారు. ఇటు కరోనా కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమైన పేసర్ షమీ..ఈసిరీస్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదు. తాజాగా మరో ఆల్‌రౌండర్ దీపక్ హుడా సైతం దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. వెన్ను గాయంతో జట్టుకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో ఆర్‌సీబీ ప్లేయర్ షాబాద్ అహ్మద్ ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది.
దీనిపై రేపటిలోపు క్లారిటీ రానుంది. షమీ స్థానంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఉమేష్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇటు శ్రేయస్ అయ్యర్ సైతం జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఏదిఏమైనా బ్యాటింగ్ పరంగా భారత జట్టు బలంగా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ విశేషంగా రాణిస్తున్నారు. వీరికితోడు దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నారు.
బౌలింగ్ పరంగా బుమ్రా, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్ ఉండనున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, ఆశ్విన్, చాహర్ ఉన్నారు. ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్‌లో తలెత్తిన లోపాలను సరి చేసుకుని బరిలోకి దిగాలని టీమిండియా యోచిస్తోంది. ఈసిరీస్‌ను సైతం దక్కించుకుని..వరల్డ్ కప్‌నకు వెళ్లాలని భావిస్తోంది. ఇటు దక్షిణాఫ్రికా జట్టు సైతం బలంగా ఉంది. ఇటీవల టీ20ల్లో ఆ జట్టు విశేషంగా రాణిస్తోంది. దీంతో తిరువనంతపురం టీ20 రసవత్తరంగా సాగనుంది.
రెండో టీ20 మ్యాచ్ గౌహతిలో, మూడో మ్యాచ్ ఇండోర్‌లో జరగనుంది. ఈసిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. లక్నోలో తొలి వన్డే, రాంచిలో రెండో వన్డే, ఢిల్లీలో మూడో వన్డే జరగబోతోంది. ఇప్పటికే ఇరు జట్లను ఎంపిక చేశారు. ఈసిరీస్ ముగియగానే భారత్, దక్షిణాఫ్రికా జట్లు..ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాయి. అక్టోబర్ 13 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది.
Hello Thiruvananthapuram 👋
Time for the #INDvSA T20I series. 👍#TeamIndia | @mastercardindia pic.twitter.com/qU5hGSR3Io
— BCCI (@BCCI) September 27, 2022
Also read:Hyderabad Rains: హైదరాబాద్‌లో వరుణ ప్రతాపం..లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Also read:Bhuvneshwar Kumar: భువనేశ్వర్ విఫలం కావడానికి అదే కారణం..సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి