Asian Champions Trophy 2023: పాకిస్థాన్ పై గెలిచి.. సెమీస్ కు దూసుకెళ్లిన భారత్..

Asian Champions Trophy 2023 Hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ జట్టు తన హవాను కొనసాగిస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న పోరులో తాజాగా పాకిస్థాన్ ను మట్టికరిపించి సగర్వంగా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2023, 07:59 AM IST
Asian Champions Trophy 2023: పాకిస్థాన్ పై గెలిచి.. సెమీస్ కు దూసుకెళ్లిన భారత్..

IND VS PAK Hockey 2023: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో దాయాది పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 4-0 గోల్స్ తో గెలుపొందింది భారత్. మన జట్టు తరపున కెప్టెన్ హార్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ (15వ, 23వ) సాధించగా.. జుగ్ రాజ్ సింగ్(36వ), ఆకాశ్ దీప్ సింగ్(55వ) కూడా చెరో గోల్ కొట్టారు. అయితే ఇందులో మూడు గోల్స్ ఫెనాల్టీ కార్నర్ల ద్వారా రావడం విశేషం. ఈ మ్యాచ్ లో పాక్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.  5 మ్యాచుల్లో నాలుగు గెలిచి, ఒకటి డ్రాగా ముగించిన హర్మన్ ప్రీత్ సేన 13 పాయింట్లు సాధించి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో టీమిండియా జపాన్ ను ఢీకొంటుంది. మరోవైపు సెమీస్ లో మలేసియా, కొరియా తలపడనున్నాయి. 

పాక్ తో జరిగిన మ్యాచ్ లో మెుదట నుంచే భారత్ ఆధిపత్యం కనబరిచింది. తొలి క్వార్టర్ చివరిలో లభించిన తొలి ఫెనాల్టి కార్నర్ ను హర్మన్ ప్రీత్ బలమైన ఫ్లిక్ తో గోల్ గా మలిచాడు. 23వ నిమిషంలో భారత్ కు రెండో పెనాల్టీ కార్నర్ లభించగా.. దానిని కూడా కెప్టెన్ హర్మన్ బలమైన డ్రాగ్ ప్లిక్ తో నెట్ లోకి గోల్ కొట్టి.. భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. బ్రేక్ అనంతరం తిరిగి ఆట ప్రారంభించిన ఆరు నిమిషాలకే భారత్ మరో గోల్ కొట్టింది. పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచిన జుగ్ రాజ్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. దాయాది జట్టుకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా... ఆ రెండింటిని వృథా చేసుకుంది. 55వ నిమిషంలో ఆకాశ్ దీప్ గోల్ కొట్టి భారత్ 4-0 ఆధిక్యాన్ని అందించాడు. 

Also Read: Irfan Pathan: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ..హార్దిక్ వల్లే మిస్సయిందా, వైరల్ అవుతున్న ఇర్ఫాన్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News