David Miller injury update: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో గుజరాత్ టైటాన్స్ గురువారం (ఏప్రిల్ 4) 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన గుజరాత్ రెండు మ్యాచుల్లో గెలిచి.. రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.
అయితే పంజాబ్ తో ఓటమి జీర్ణించుకోకముందే ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు బిగ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ గాయపడ్డాడు. దీంతో అతడికి రెండు వారాల పాటు రెస్ట్ అవసరం కానుంది. దీంతో ఈ సీజన్ లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. తన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించే మిల్లర్ సేవలు కోల్పోవడం ఆ జట్టుకు పెద్ద నష్టమనే చెప్పాలి. మిల్లర్ గాయపడిన విషయాన్ని శుక్రవారం కేన్ మామ వెల్లడించాడు. అతడి స్థానంలోనే విలియమ్సన్ ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకున్నాడు. జట్టులోకి వచ్చినందుకు ఆనందంగా ఉందని.. అయితే అతడి సేవలను కోల్పోవడం బాధాకరంగా ఉందని కేన్ మామ అన్నాడు.
గురువారం సొంత గడ్డపై జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది గుజరాత్ టైటాన్స్. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ టాపార్డర్ విఫలమైనా.. శశాంక్ సింగ్(61 నాటౌట్), అశుతోష్ శర్మ(31)లు చివరిదాకా పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. గుజరాత్ ఆటగాళ్లలో కెప్టెన్ గిల్ (89) అద్భుతంగా ఆడాడు.
Also Read: Shocking news: ముంబైను వీడనున్న రోహిత్.. హిట్ మ్యాన్ బాటలోనే మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లు!!
Also read: SRH Vs CSK: హైదరాబాద్, చెన్నై మ్యాచ్ టికెట్ల లొల్లి.. మండిపడిన మాజీ క్రికెటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి