టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింహ్ దోనీ క్రికెట్ కు స్వస్తి పలికారు. క్రికెట్ ప్రపంచం నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన ప్రకటించారు. వాస్తవానికి ఇటీవలి కాలంలో మళ్లీ క్రికెట్ పిచ్ లో ధోనీ మెరుపులు ఝులిపిస్తారనే వార్తలు విన్పించాయి. అందుకే తగ్గట్టుగానే తాను ఫిట్ గానే ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు స్వయంగా ప్రకటించి సంచలనం రేపారు. క్రికెట్ అభిమానులకు ఇది కచ్చితంగా జీర్ణించుకోలేని వార్తే.
Indian cricketer Mahendra Singh Dhoni announces retirement from international cricket. pic.twitter.com/3UwE6ZXfK6
— ANI (@ANI) August 15, 2020
ఇటీవల ధోనీ గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు క్రికెట్ అబిమానుల్ని ఆనందానికి గురి చేశాయి. విరాట్ కోహ్లీ పెళ్లి వేడుకల్లో తాను మహేంద్రసింగ్ ధోనీతో మాట్లాడానని సంజయ్ చెప్పారు. ఆ సమయంలో రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ...టీమ్ లో అందరికంటే వేగంగా పరుగెత్తగలిగినంత కాలం తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అర్హుడినే అనుకుంటున్నట్టుగా ధోనీ చెప్పాడని సంజయ్ మంజ్రేకర్ తెలిపారు. ఇప్పుడు హఠాత్తుగా ఇలా ప్రకటించడం షాక్ కల్గిస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు ధోనీ తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించాడు. ఇన్నాళ్లుగా తనకు మద్దతిచ్చిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధోనీ ధన్యవాదాలు తెలిపాడు. ధోనీ సారధ్యంలో టీమ్ ఇండియా రెండోసారి ప్రపంచ కప్ ను గెల్చుకుంది. అటు టీ20 ప్రపంచకప్ ను కూడా ధోనీ సారధ్యంలోనే ఇండియా గెల్చుకుంది. 2004 డిసెంబర్ 23 న బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ తో క్రికెట్ లో ధోనీ అడుగెట్టాడు. ధోనీ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయంతో యావత్ క్రికెట్ ప్రపంచం నిర్ఘాంతపోయింది.