తొలి టెస్టు: ఉత్కంఠ భరితమైన పోరులో కోహ్లీ సేనపై ఇంగ్లండ్ పైచేయి సాధించింది. భారత్ పై 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ గెలిచేందుకు భారత్‌కు 84 పరుగులు.. ఇంగ్లండ్‌కు 5 వికెట్లు అవసరమైన తరుణంలో ఈ రోజు మ్యాచ్ ప్రారంభమైంది. ఆట ఆరంభంలోనే దినేష్ కార్తీక్ పెవిలియన్ బాటపట్టాడు. ఇదే సమయంలో కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసుకొని జోరు మీద కనిపించాడు. ఆ తర్వాత పాండ్యా అలా వచ్చి ఇలా వెళ్లి పోవడం... అనంతరం కోహ్లీ (51) వెనుదిరగడంతో టీమిండియా ఓటమి అనివార్యమైంది. అనంతరం వెనువెంటనే లోయర్ ఆర్డర్ కూడా చేతులెత్తేయడం జరిగిపోయింది. దీంతో భారత్ 162 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఫలితంగా మ్యాచ్ ఇంగ్లండ్ వశమైంది. ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్ట్రోక్స్ 4 వికెట్లు తీయగా..జేమ్స్ ఆండ్రుసన్ , స్టువర్ట్ బోర్డ్ చెరో రెండు వికెట్టు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించారు. కాగా తాజా ఓటమితో టీమిండియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 తేడాతో ఇంగ్లండ్ ముందంజ వేసినట్లయింది.
స్కోరు వివరాలు ఇలా ఉన్నాయి.
తొలి ఇన్నింగ్స్: ఇంగ్లండ్ 287 ఆలౌట్. ఇండియా 274 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్: ఇంగ్లండ్ 180 ఆలౌట్. ఇండియా 162 ఆలౌట్