Harbhajan, Sehwag slams journalist who sent threat messages to Saha: మార్చి నెలలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత నియంత్రణ క్రికెట్ మండలి (బీసీసీఐ) శనివారం భారత జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సరిగా రాణించని సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మలకు చోటు కల్పించలేదు. జయంత్ ఠాకుర్, సౌరభ్ కుమార్, ప్రియాంక్ పంచల్, కేఎల్ భరత్ భారత టెస్ట్ జట్టులోకి వచ్చారు.
సీనియర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను జట్టులోకి ఎంపిక చేయకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద సంచలంగా మారింది. జట్టులోకి సాహా ఎంపిక కాకపోవడంతో ఓ జర్నలిస్ట్ అతడి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించాడు. ఇందుకోసం సాహాకు కాల్ చేయగా అతడు స్పందించలేదు. దాంతో అతడి వాట్సప్‌కు మెసేజులు చేశాడు. ఇంటర్వ్యూ కోసం బలవంతం చేశాడు. అయినా కూడా భారత వికెట్ కీపర్ స్పందించకపోయేసరికి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దాంతో సాహా ఆగ్రహానికి గురయ్యాడు.
ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం తనను బలవంతం చేసినట్లు వృద్ధిమాన్ సాహా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజీల స్క్రీన్‌షాట్ బయటపెట్టాడు. 'భారత క్రికెట్ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్టు నుంచి ఎదురైన అనుభవం ఇది. చాలా బాధగా ఉంది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది' అని సాహా వరుస ట్వీట్లు చేశాడు. ఈ ట్వీట్లు శనివారం నుంచి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వృద్ధిమాన్ సాహా ట్వీట్లు చూసిన టీమిండియా మాజీలు హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్ సదరు జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వృద్ధి మీరు ఆ జర్నలిస్టు పేరు చెప్పండి. అప్పుడే క్రికెట్ ఆటకు ఎవరు ఆటంకాలు కల్పిస్తున్నారో అందరికీ తెలుస్తుంది. లేదంటే మంచి వారిని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇది ఎలాంటి జర్నలిజం?. బీసీసీఐ ఆటగాళ్లకు రక్షణ కల్పించాలి' అని బీసీసీఐ, జై షా, సౌరవ్ గంగూలీ పేర్లను హర్భజన్ ట్యాగ్ చేశాడు.
Wridhi you just name the person so that the cricket community knows who operates like this. Else even the good ones will be put under suspicion.. What kind of journalism is this ? @BCCI @Wriddhipops @JayShah @SGanguly99 @ThakurArunS players should be protected https://t.co/sIkqtIHsvt
— Harbhajan Turbanator (@harbhajan_singh) February 20, 2022
ఇలాంటి ఘటన జరగడం చాలా భాధగా ఉందని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. 'వృద్ధిమాన్ సాహాను అలా బెదిరించడం చాలా విచారకరం. చెంచాగిరి చేసేవాడు మాత్రమే ఎవరితోనూ గౌరవించబడడు. అసలు అతడు జర్నలిస్టు కాదు. వృద్ధి నేను నీకు మద్దతుగా ఉన్నాను' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. వృద్ధిమాన్ సాహా భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. టెస్టులో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు.
Also Read: Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండానే గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. అదెలాగంటే..
Also Read: Ranji Trophy Yash Dhull: యశ్ ధుల్ అరుదైన రికార్డు.. సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు!!
Extremely sad. Such sense of entitlement, neither is he respected nor a journalist, just chamchagiri.
With you Wriddhi. https://t.co/A4z47oFtlD— Virender Sehwag (@virendersehwag) February 20, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook