Gautam Gambhir opens up on rumoured rift with MS Dhoni: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్‌లో పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇద్దరు దిగ్గజాల మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. సందర్భం వచ్చినప్పుడల్లా.. మహీపై గౌతీ మండిపడడం కూడా ఇందుకు ఓ కారణం. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తాజాగా గంభీర్ స్పష్టం చేశారు. ధోనీ అంటే తనకు గౌరవం అని, అతడికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలిపారు.
తన యూట్యూబ్ షో 'ఓవర్ అండ్ అవుట్'లో జతిన్ సప్రూతో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఎంఎస్ ధోనీ, నాకు మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు చూశాను. అవన్నీ పుకార్లు మాత్రమే. మహీ అంటే నాకు చాలా గౌరవం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇదివరకే ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. మరోసారి చెబుతున్నా. 138 కోట్ల భారతీయ ప్రజల ముందు కూడా ఇదే చెబుతా' అని గౌతీ అన్నారు.
ఎంఎస్ ధోనీకి ఏ అవసరం వచ్చినా నేను ముందుంటాను. ధోనీకి అలాంటి పరిస్థితి రాదు. కానీ ఒకవేళ వస్తే అండగా ఉంటా. మహీ భారత జట్టుకు చేసిన సేవలే అందుకు కారణం. మా ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అంతేగాని మా మధ్య ఎలాంటి వివాదాలు లేవు. మీకు ఇంకో చెప్పాలి.. ధోనీ సారథ్యంలో నేనే ఎక్కువకాలం వైస్ కెప్టెన్‌గా ఉన్నా. వివాదాలు ఉంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది. ఐపీఎల్‌లో ఆడినప్పుడు మాత్రమే మైదానంలో మేము ప్రత్యర్థుల్లాగా ఉన్నాం' అని గౌతమ్ గంభీర్ వివరించారు.
ఎంఎస్ ధోనీ భారత్ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి ఉంటే.. అన్ని రికార్డులు బద్దలయ్యేవని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. 'ధోనీ టీమిండియా తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి ఉంటే అన్ని రికార్డులు బద్దలయ్యేవి. నంబర్ 3లో గొప్ప ఆటగాళ్ల గురించి మాట్లాడుతున్నా. మహీ ఆ స్థానంలో ఆడితే ప్రతి రికార్డునూ తిరగరాసేవాడు' అని గౌతీ చెప్పారు. ధోనీ కెరీర్ ఆరంభంలో మూడో స్థానంలో ఆడాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 993 పరుగులు చేశాడు. 2005లో పాకిస్థాన్‌పై 148, శ్రీలంకపై 183 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Also Read: Tejasswi Prakash-Karan Kundrra: పెళ్లి కాగానే 25 మంది పిల్లలను కంటాం: నాగిని హీరోయిన్
Also Read: Jhulan Goswami: డబుల్ సెంచరీ కొట్టిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook