World Cup 2023 Ind vs Eng: ప్రపంచకప్ 2023లో ఇవాళ జరగనున్న మ్యాచ్ ఇటు ఇంగ్లండ్ అటు ఇండియాకు కీలకం. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకునేందుకు ఇంగ్లండ్ ప్రయత్నించాల్సి ఉంటుంది. అటు ఈ మ్యాచ్ విజయంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకునేందుకు ఇండియాకు అవకాశముంటుంది. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై అందరికీ ఆసక్తి పెరుగుతోంది.
ఐసీసీ ప్రపంచకప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అత్యంత పేలవమైన ప్రదర్శన చూపిస్తోంది. ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. బంగ్లాదేశ్‌పై 137 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్..మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో, ఆఫ్ఘనిస్తాన్ చేతిలో 69 పరుగుల తేడాతో, దక్షిణాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో, శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ జరిగిన వన్డేల్లో ఇండియాదే ఆధిపత్యం కన్పిస్తోంది. మొత్తం 106 మ్యాచ్‌లలో 57 ఇండియా గెలవగా, ఇంగ్లండ్ 44 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అయితే ప్రపంచకప్ మ్యాచ్‌లలో మాత్రం ఇంగ్లండ్‌దే ఆధిపత్యం. 2003 తరువాత వరుసగా 2007, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్ చేతిలో ఇండియా పరాజయం పాలైంది.
రెండు జట్ల బలాబలాలు
టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నారు. ఇక హార్దిక్ పాండ్యా స్థానంలో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవల్సి ఉంటుంది. బౌలింగ్ విభాగంలో బూమ్రా, షమీ, జడేజా, కుల్దీప్ రాణిస్తున్నారు. సిరాజ్ లేదా అశ్విన్‌లలో ఎవరు ఆడతారనేది ఇంకా తేలలేదు. అటు ఇంగ్లండ్ విషయానికొస్తే బట్లర్, రూట్, బెయిర్ స్టోలు ఘోరంగా విఫలం కావడం ఆ జట్టుకు మైనస్‌గా మారింది. ఇంగ్లండ్ ఇప్పుడు కూడా బౌలింగ్ ఆల్ రౌండర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. వోక్స్, విల్లీ, అట్కిన్సన్‌లు రాణించవచ్చు.
పిచ్ స్వభావం ఎలా ఉంది
లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్. మొదట్లో సీమర్లు ప్రభావం చూపించినా తరువాత స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వర్ష సూచన లేదని తెలుస్తోంది. మొత్తానికి బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడంతో భారీ స్కోర్లకు అవకాశం లేదు. పేసర్లకు అనుకూలంగా, ప్రతికూలంగానూ మారవచ్చు. ఈ పిచ్‌పై ఇప్పటి వరకూ 7 వన్డేలు జరిగాయి. ఇందులో 4 జట్లు లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధిస్తే 3 జట్లు మొదట బ్యాటింగ్ చేసి గెలిచాయి. ఇక లక్నో వాతావరణం గరిష్టంగా 31 డిగ్రీలు ఉండవచ్చు. హ్యుమిడిటీ 45 శాతం ఉంటుంది. గూగుల్ విన్ ప్రోబెబిలిటీ ప్రకారం టీమ్ ఇండియాకు 66 శాతం విజయావకాశాలున్నాయి.
Also read: ICC World Cup 2023: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ నేడే, 20 ఏళ్లుగా దక్కని విజయం ఈసారి లభిస్తుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook