IND Playing XI for 1st T20I vs NZ: పృథ్వీ షాకి చోటు లేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్!

Aakash Chopra picks his India Playing 11 for 1st T20I vs New Zealand. తొలి టీ20 నేపథ్యంలో భారత ప్లేయింగ్ 11పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 27, 2023, 04:32 PM IST
  • పృథ్వీ షాకి చోటు లేదు
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్
  • భారత తుది జట్టు ఇదే
IND Playing XI for 1st T20I vs NZ: పృథ్వీ షాకి చోటు లేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్!

Aakash Chopra picks his IND Playing XI for 1st T20I vs NZ: న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా మరో ఆసక్తికర సమరానికి సిద్దమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టీ20 నేడు జరగనుంది. రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో హార్దిక్‌ పాండ్యా మరోసారి జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. అయితే తొలి టీ20 నేపథ్యంలో భారత ప్లేయింగ్ 11పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. 

న్యూజిలాండ్‌తో జరిగే మొదటి టీ20లో యువ ఓపెనర్ పృథ్వీ షాకు భారత ప్లేయింగ్ 11లో చోటు లేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'నేడు ఆడే మ్యాచ్ రాంచీ మైదానంలో. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హోం గ్రౌండ్. ధోనీ అందుబాటులో లేడు కాబట్టి అతని శిష్యుడు ఇషాన్ కిషన్ ఆడతాడు. ఇషాన్ కిషన్ ఇక్కడ ఒకసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతని గత 11 మ్యాచ్‌లు చూస్తే పరుగులు చేయలేదు' అని అన్నాడు. 

'శుభ్‌మాన్ గిల్‌ తిరుగులేని ఆటగాడు. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కానీ టీ20ల్లో అతను అలా ఆడుతాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇషాన్ కిషన్ మరియు శుభ్‌మాన్ గిల్‌లు ఓపెనింగ్‌ చేస్తే బాగుంటుంది. పృథ్వీ షాకు ఇప్పటికిప్పుడు అవకాశం లభించదని నేను భావిస్తున్నాను. రాహుల్ త్రిపాఠి నంబర్ 3లో వస్తాడు. మిగిలిన ఆటగాళ్లు మీకు తెలుసు. జట్టులో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మరియు దీపక్ హుడా ఉంటారు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌, శివమ్‌ మావిలని ఆడించాలి' అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. 

భారత తుది జట్టు (అంచనా):
 శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్, రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా, వాషింగ్టన్ సుందర్‌, కుల్దీప్ యాదవ్, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్. 

Also Read: Mahindra Price Hike 2023: పెరిగిన మహీంద్రా ఎస్‌​యూవీ, ఎక్స్‌యూవీల ధరలు.. కొత్త ధరల జాబితా ఇదే!   

Also Read: Guru Mahadasha 2023: అరుదైన గురు మహాదశ.. తరగని ఐశ్వర్యం మీ సొంతం! 16 సంవత్సరాలు రాజు జీవితం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News