U19 Womens T20 World Cup: టీమిండియాదే వరల్డ్ కప్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై జయకేతనం

India Won U19 Womens T20 World Cup: మహిళల అండర్-19 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌ జట్టు అలవోకగా చిత్తుచేసింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 08:16 PM IST
U19 Womens T20 World Cup: టీమిండియాదే వరల్డ్ కప్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై జయకేతనం

India Won U19 Womens T20 World Cup: భారత అండర్-19 మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని మొదటిసారి కైవసం చేసుకుంది. వరల్డ్ కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. మొదట బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ జట్టు 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 14 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా శ్వేతా సెహ్రావత్ నిలిచింది. 

 

ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్‌లోనే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ లిబర్టీ హీప్‌ను అవుట్ చేసి టైటాస్ భారత్‌కు శుభారంభం అందించింది. నాలుగో ఓవర్‌లో అర్చన దేవి రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లిష్ జట్టు కష్టాల్లో పడింది. ఆ తరువాత టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్ల తీయడంతో ఇంగ్లండ్ జట్టు కోలుకోలేకపోయింది.

స్పిన్నర్లు అర్చన దేవి, పార్శ్వి చోప్రా, ఫాస్ట్ బౌలర్ టైటాస్ సాధు తలో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌వుమెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మన్నత్ కశ్యప్, కెప్టెన్ షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ కూడా చెరో వికెట్ పడగొట్టారు. చివరకు 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌వుమెన్‌లో నలుగురు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. 

అనంతరం ఈజీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ మొదట్లో తడబడింది. సిక్స్, ఫోర్‌తో దూకుడు ప్రదర్శించిన కెప్టెన్ షెఫాలీ వర్మ (15) మూడో ఓవర్లోనే ఔట్ అయింది. మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ (5) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తరువాత టీమిండియా బ్యాట్స్‌వుమెన్‌ సౌమ్య తివారి (24), త్రిష (24) రాణించడంతో విజయం సులువైంది. 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా భారత క్రీడాకారిణి శ్వేత అగ్రస్థానంలో నిలిచింది. 6 మ్యాచ్‌ల్లో 292 పరుగులు చేసింది. ఇందులో మూడు 3 అర్ధ సెంచరీలు చేసింది. ఒక ఇన్నింగ్స్‌లో 90కి పైగా పరుగులు చేసింది. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మ్యాగీ క్లార్క్ అగ్రస్థానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసింది. భారత్ తరఫున పార్శ్వి అత్యధికంగా 9 వికెట్లు పడగొట్టింది.

Also Read: Nandamuri Tarakaratna: నా గుండె పగిలిపోయింది.. తారకరత్న ఆరోగ్యంపై నారా లోకేష్ ఎమోషనల్   

Also Read: Novak Djokovic: చరిత్ర సృష్టించిన నొవాక్ జోకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఫైనల్లో విక్టరీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News