IND vs NZ 3rd ODI: టీమిండియాదే బ్యాటింగ్‌.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్! తుది జట్టులోకి ఉమ్రాన్‌, చహల్

India vs New Zealand 3rd ODI Playing 11 Out. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని మరికొద్దిసేపట్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆరంభం కానుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 24, 2023, 01:39 PM IST
  • టీమిండియాదే బ్యాటింగ్‌
  • ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్
  • తుది జట్టులోకి ఉమ్రాన్‌, చహల్
IND vs NZ 3rd ODI: టీమిండియాదే బ్యాటింగ్‌.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్! తుది జట్టులోకి ఉమ్రాన్‌, చహల్

India vs New Zealand 3rd ODI Playing 11 Out: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. స్టార్ ప్లేయర్స్ మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ నామమాత్రమైన ఈ వన్డేకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఉమ్రాన్‌ మాలిక్, యుజ్వేంద్ర చహల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కివీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.

మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకొన్న భారత్.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. మూడో వన్డేలో గెలిచి ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌కు చేరాలని రోహిత్ సేన చూస్తోంది. మరోవైపు క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలని కివీస్‌ చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఇండోర్‌ మైదానం బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం. కాబట్టి పరుగుల వరద పారే అవకాశం ఉంది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, ఉమ్రాన్‌ మాలిక్. 
న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్, డేవన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్‌ లాథమ్ (కెప్టెన్, వికెట్‌ కీపర్), గ్లెన్‌ ఫిలిప్స్‌, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్‌ శాంట్నర్, లాకీ ఫెర్గూసన్, జాకబ్‌ డఫీ, బ్లెయిర్‌ టిక్నెర్. 

Also Read: Yamaha RX100 Launch: బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. యమహా ఆర్ఎక్స్ 100 మళ్లీ లాంచ్ అవుతోంది! 150cc ఇంజిన్

Also Read: Cheapest New Honda Activa 2023: ఖరీదైన కార్ల ఫీచర్లతో.. సరికొత్త చౌకైన హోండా యాక్టివా లాంచ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News