Sunil Gavaskar Picks India Playing XI For Pakistan Match: ఆసియా కప్ 2022 టోర్నీకి సమయం దగ్గరపడింది. శనివారం (ఆగష్టు 27) మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆసియా కప్ ఆరంభం మ్యాచులో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. 28న దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే దాయాది దేశాలు తలపడుతుండడంతో.. ఈ మెగా మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హైవోల్టెజీ మ్యాచ్‌పై అందరూ తమ తమ అభిప్రాయాలు చెపుతున్నారు. ఈ క్రమంలోనే భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించారు.
రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేందుకు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లను సునీల్ గవాస్కర్ ఎంచుకున్నారు. గవాస్కర్ వీరిద్దరిలో (సూర్య, రాహుల్) ఎవరినీ ఓపెనర్లుగా బరిలోకి దిగాలో చెప్పలేదు. అయితే రోహిత్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఫస్ట్‌డౌన్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీని సన్నీ ఎంచుకున్నారు. రాహుల్ ఓపెనింగ్ దిగితే.. సూర్యకుమార్ 4వ స్థానంలో ఆడతాడు. ఇక 5వ స్థానంలో రిషబ్ పంత్‌కు స్థానం ఇచ్చారు.
6, 7 స్థానాల్లో ఆల్‌రౌండర్‌లు హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజాకు గవాస్కర్ చోటిచ్చారు. వీరిద్దరికి చోటివ్వడంతో ఫినిషర్ దినేష్ కార్తీక్‌కు చోటు లేకుండా పోయింది. సన్నీ ఇద్దరు స్పిన్నర్లకు చోటిచ్చారు. ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్‌లను తీసుకున్నారు. కార్తీక్‌ను తీసుకోవాలంటే ఈ ఇద్దరిలో ఒకరికి మాత్రమే తీసుకోవాలి. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లను గవాస్కర్ తీసుకున్నారు. సన్నీ జట్టును పరిశీలిస్తే.. దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ బెంచ్‌పై కూర్చోవాల్సిందే.
సునీల్ గవాస్కర్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్.
Also Read: Pranita Subhash Hot Photos: తల్లయ్యాక పొట్టి బట్టలలో దర్శనం ఇచ్చిన ప్రణీత.. ఫోటోలు చూశారా?
Also Read: హృతిక్ దగ్గర కంగనా ప్రైవేట్ ఫోటోలు.. అందంగా ఉందంటూ బాలీవుడ్ క్రిటిక్ సంచలనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook