Bhuvneshwar Kumar will struggling in Australia says Wasim Akram: టీ20 ప్రపంచకప్ 2022 జరగనున్న ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, బంతి స్వింగ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసీస్ పిచ్‌లపై ఇబ్బంది పడే అవకాశం ఉందన్నాడు. బంతి స్వింగ్ చేసే భువీ రాణించకుంటే.. టీమిండియాకు కష్టాలు తప్పవు అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
ఖలీజ్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీమ్ అక్రమ్ మాట్లాడుతూ... 'కొత్త బంతితో భువనేశ్వర్ కుమార్ బాగా బౌలింగ్ చేస్తాడు. వికెట్‌కు ఇరువైపులా బంతిని స్వింగ్ చేయగలడు. యార్కర్లను కూడా సంధిస్తాడు. అయితే భువీ పేస్‌తోనే సమస్య రానుంది. బంతి స్వింగ్ కాకపోతే అతడు చాలా ఇబ్బంది పడతాడు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా లేదు. భువీ కూడా రాణించకుంటే.. టీమిండియాకు కష్టాలు తప్పవు. ఏదేమైనా భువనేశ్వర్ గొప్ప బౌలర్ అనే మాటలో ఎలాంటి సందేహం లేదు' అని అన్నాడు.
'ఆస్ట్రేలియా పిచ్‌లపై పేస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకొంటే చాలా ఉపయోగం ఉండేది. ఎందుకంటే అతడు మంచి పేస్‌ను రాబడతాడు. భారత జట్టు సెలెక్షన్ కమిటీలో నేను భాగమైతే తప్పకుండా ఉమ్రాన్‌ను తీసుకొనేవాడిని. భువనేశ్వర్ నేతృత్వంలో భారత్ ఫాస్ట్ బౌలింగ్ దళం బాగానే ఉంది. హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ మరింత బాధ్యతగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది' అని వసీమ్ అక్రమ్ చెప్పాడు.
'సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో చాలా ప్రమాదకరమైన ఆటగాడు. సూర్య మైదానం మొత్తం షాట్లు ఆడగలడు. అతడు 360 డిగ్రీల ఆటగాడు. ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతాకు ఆడే సమయంలో సూర్యను మొదటిసారి చూశా. రెండేళ్ల పాటు అతడితో ప్రయాణించా. సూర్యను కోల్‌కతా విడిచిపెట్టడం నాకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సమయంలో అతడి వయసు 120 ఉంటుంది. ఇప్పటికీ కోల్‌కతాతో ఉండుంటే కెప్టెన్ అయ్యేవాడు. నా ఫేవరేట్ ఆటగాళ్లలో సూర్య ఒకడు' అని పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.
Also Read: Karva Chauth 2022: భార్య ఉపవాసం చేసిందని.. కత్తిపోట్లు పొడిచిన భర్త! చివరకు ఏమైందంటే
Also Read: "మా"కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా సస్పెండ్ చేస్తాం: మంచు విష్ణు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook