IND vs SA 2nd T20 Match Highlights: తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 238 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులే చేసింది. దీంతో సిరీస్‌లో కీలకమైన రెండో మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుంది.
సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 57 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్సులు) చేయగా.. రోహిత్ శర్మ 43 పరుగులు (7 ఫోర్లు, ఒక సిక్స్) రాబట్టి 96 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా జట్టు స్కోర్‌కి మంచి పునాది పడినట్టయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 48 పరుగులు ( ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో స్టేడియం చుట్టూ బౌండరీలు (4x5, 6x5) బాదుతూ చెలరేగిపోయాడు. 22 బంతుల్లో 61 పరుగులు రాబట్టి సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన దినేష్ కార్తిక్ సైతం 17 పరుగులు (7 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్) బాది జట్టు స్కోరుని పరుగులెత్తించాడు. దీంతో సౌతాఫ్రికా ముందు టీమిండియా ఒక భారీ స్కోర్‌ని లక్ష్యంగా నిర్ధేశించగలిగింది.
బౌలింగ్‌తో టీమిండియాను అడ్డుకోలేకపోయిన సౌతాఫ్రికా కనీసం బ్యాటింగ్‌తోనైనా తామేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంది. ఓపెనర్ టెంబ బవుమ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిలీ డకౌట్ అయినప్పటికీ.. ఐడెన్ మర్‌క్రమ్‌తో కలిసి క్వింటన్ డి కాక్ నిలకడగా ఆడుతూ మ్యాచ్‌ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో క్వింటన్ డి కాక్ 69 పరుగులు (48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు ) చేయగా ఐడెన్ 19 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అనంతరం డేవిడ్ మిల్లర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేంతగా పోరాడి 47 బంతుల్లోనే 106 పరుగులు (8 ఫోర్లు, 7 సిక్సులు) బాదినప్పటికీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 221 పరుగులకే పరిమితమై లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. సౌతాఫ్రికాకు డేవిడ్ మిల్లర్ వీరోచిత పోరాటం, సెంచరీ వృథా అయ్యాయి.
Appreciation all around for David Miller. 👏👏
But it's #TeamIndia who win the second #INDvSA T20I to take an unassailable lead in the series. 🙌 🙌
Scorecard 👉 https://t.co/58z7VHliro pic.twitter.com/ShKkaF0inW
— BCCI (@BCCI) October 2, 2022
కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకోగా.. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ (2/23) మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. ఇప్పటికే తిరువనంతపురంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ విజయంతో 2-0 కి చేరి సిరీస్‌పైనే పూర్తి పట్టు సాధించినట్టయింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత్ ఆ వెంటనే సౌతాఫ్రికాపైనా పైచేయి సాధించడం అనేది టీ20 వరల్డ్ కప్‌కి భారీ బూస్టింగ్‌ని ఇచ్చినట్టయింది.
Also Read : Snake On Field: రెండో టీ20 చూడ్డానికి వచ్చిన ప్రత్యేక అతిథి.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు (వీడియో)!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి