IND vs SA: తొలి వన్డేలో ఓటమిపై టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్ స్పందించాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడం తనకెప్పుడు ఇష్టమేనని..ఐతే చివరి ఓవర్లో సరైన షాట్లు ఆడలేకపోయానని తెలిపాడు. వచ్చే మ్యాచ్‌లో వీటిని అధికమిస్తానన్నాడు. మొత్తంగా తన ఇన్నింగ్స్ పట్ల సంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేశాడు. సఫారి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారన్నాడు. వారిలో షంసి ఒక్కడే ఎక్కువ పరుగులు ఇచ్చాడని చెప్పాడు.
అందుకే అతడినే టార్గెట్ చేశానని..చివరి ఓవర్ షంసి వేస్తాడని తనకు తెలుసు అని అన్నాడు. కనీసం 24 పరుగులు చేయాలని అనుకున్నానని..నాలుగు సిక్సర్లు కొట్టగలనని అనుకున్నానని తెలిపాడు. ఐతే అంతకుముందు ఓవర్లను దక్షిణాఫ్రికా పేసర్లు అద్భుతంగా వేశారని గుర్తు చేశాడు. బౌలింగ్ విభాగంలో టీమిండియా మరింత మెరుగుపడాల్సి ఉందన్నాడు సంజూ శాంసన్. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 250 పరుగులను చేధించలేకపోయింది. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో 240 పరుగులకు పరిమితం అయ్యింది. చివర్లో సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్ గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఠాకూర్ ఔట్ కావడంతో భారత్ గెలుపు కష్టంగా మారింది. ఆ తర్వాత వచ్చిన టాయిలెండర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. అటు వైపు సంజూ శాంసన్ ఉండటంతో గెలుపు ఆశలు రేగాయి. ఐతే దక్షిణాఫ్రికా పేసర్లు 38, 39 ఓవర్లను అద్భుతంగా వేశారు. ఈఓవర్లలో పరుగులు తక్కువ రావడంతోపాటు వరుసగా వికెట్లు పడ్డాయి.
దీంతో 40వ ఓవర్‌లో 30 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఐనా టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్ గట్టిగానే పోరాడాడు. ఐతే అది సరిపోలేదు. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పిచ్ తడిగా ఉండటంతో బాల్ టర్న్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సైతం ఇబ్బంది పడిన మెరుగైనా స్కోర్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈనెల 9న రాంచీ వేదికగా ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
Also read:Kodandaram: కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగం..కోదండరామ్ హాట్ కామెంట్స్..!
Also read:Munugode Bypoll: మునుగోడులో రెడ్డి వర్సెస్ రెడ్డి..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IND vs SA: ఆఖరి ఓవర్‌లో నా గేమ్ ప్లాన్ అదే..సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
మూడు వన్డేల సిరీస్
తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి
గేమ్ ప్లాన్‌పై విమర్శలు