IND vs SL 2023: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భువనేశ్వర్‌ అరుదైన రికార్డుకు ఎసరు పెట్టిన చహల్‌!

IND vs SL, Yuzvendra Chahal needs 5 more wickets for 50 scalps at home in T20Is. తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 3, 2023, 05:32 PM IST
  • శ్రీలంకతో టీ20 సిరీస్‌
  • భువనేశ్వర్‌ రికార్డుకు ఎసరు పెట్టిన చహల్‌
  • కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా
IND vs SL 2023: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భువనేశ్వర్‌ అరుదైన రికార్డుకు ఎసరు పెట్టిన చహల్‌!

IND vs SL 1st T20I, Yuzvendra Chahal eyes on Bhuvneshwar Kumar T20I: స్వదేశంలో శ్రీలంకతో భారత్ టీ20, వన్డే సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం (2023 జనవరి 3) రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. టీ20 సిరీస్‌కు భారత స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లు దూరమయ్యారు. దాంతో టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచే అవకాశం యూజీ ముందుంది. నేడు జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీస్తే.. ఈ ఘనత అందుకోనున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా ప్రస్తుతం సీనియర్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో భువీ 87 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు చహల్‌ 71 మ్యాచ్‌లలో 87 వికెట్లు తీశాడు.

టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు. అశ్విన్‌ టీ20 ఫార్మాట్‌లో 72 వికెట్స్ పడగొట్టాడు. పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా (70), ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (62) టాప్‌-5లో ఉన్నారు. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో స్వదేశంలో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో చేరడానికి యజ్వేంద్ర చహల్‌ ఐదు వికెట్ల దూరంలో ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ని బీసీసీఐ సెలక్టర్లు పక్కనపెట్టగా.. చహల్‌కు మాత్రం చోటు దక్కింది.

Also Read: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. టీమిండియాకు శుభవార్త!

Also Read: Kia Cars New Price: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన కియా.. ఈ కారు కొనడానికి లక్ష అదనంగా చెలించాల్సిందే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News