IND vs ZIM, Shikhar Dhawan hits 6500 runs in ODIs: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 6500 పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో 6500 పరుగుల మైలు రాయిని అందుకున్న పదో భారత బ్యాటర్‌గా గబ్బర్ రికార్డులకెక్కాడు. హరారే వేదికగా గురువారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ధావన్ ఈ రికార్డును సాధించాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నపుడు ధావన్ వన్డేల్లో కొత్త మైలురాయిని చేరుకున్నాడు.
వన్డేల్లో 6500 పరుగుల మైలు రాయిని అందుకున్న 10వ భారత క్రికెటర్‌గా శిఖర్ ధావన్ నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (18426) అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (12344), సౌరవ్ గంగూలీ (11363), రాహల్ ద్రవిడ్ (10889), ఎంఎస్ ధోనీ (10773), మొహ్మద్ అజారుద్దీన్ (9378), రోహిత్ శర్మ (9378), యువరాజ్ సింగ్ (8701), వీరేంద్ర సెహ్వాగ్ (8273) వరుసగా ఉన్నారు.
జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ 81 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. 113 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో గబ్బర్ టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (82)తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. జింబాబ్వే బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వని ధావన్.. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. గిల్ కూడా చెలరేగడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది.
That's that from the 1st ODI.
An unbeaten 192 run stand between @SDhawan25 & @ShubmanGill as #TeamIndia win by 10 wickets.
Scorecard - https://t.co/P3fZPWilGM #ZIMvIND pic.twitter.com/jcuGMG0oIG
— BCCI (@BCCI) August 18, 2022
Also Read: India vs Pakistan: ప్రపంచకప్ 2003లో పాకిస్థాన్‌తో మ్యాచ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన సెహ్వాగ్!
Also Read: IND vs ZIM: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో అనుకోని ఘటన..ఇషాన్ కిషన్‌పై తేనేటీగల దాడి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook