India Vs Zimbabwe: జింబాబ్వేతో టీమిండియా టీ20 సిరీస్‌.. షెడ్యూల్ ఇదే..!

India Vs Zimbabwe T20I Series Schedule: జింబాబ్వేతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. పొట్టి కప్ సమరం ముగిసిన అనంతరం భారత్ జూలై 6వ తేదీ నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. మ్యాచ్‌ల వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 6, 2024, 09:29 PM IST
India Vs Zimbabwe: జింబాబ్వేతో టీమిండియా టీ20 సిరీస్‌.. షెడ్యూల్ ఇదే..!

India Vs Zimbabwe T20I Series Schedule: టీ20 వరల్డ్ కప్‌ తరువాత టీమిండియా సిరీస్ ఫిక్స్ అయింది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జూలైలో భారత్ జింబాబ్వేలో పర్యటించనుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), జింబాబ్వే క్రికెట్ ప్రకటించాయి. ఈ సిరీస్ జూలై 6 నుంచి 14 జూలై వరకు హరారేలో జరగనుంది. ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడం కోసం రెండు బోర్డులు చర్చించి.. టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ను ప్రకటించాయి. 

Also Read: Eagle First Review: ‘ఈగల్’ ఇన్‌సైడ్ టాక్ అదుర్స్.. టికెట్ల రేట్ల ధరలు ఇలా..!  

జింబాబ్వే టూర్‌పై బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. ప్రపంచ క్రికెట్ కమ్యూనిటీ సహకారం అందించేందుకు బీసీసీఐ ఎప్పుడూ కృషి చేస్తోందని చెప్పారు. జింబాబ్వేలో క్రికెట్ పునర్నిర్మాణం జరుగుతోందని.. ఈ సమయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐ సపోర్ట్ అవసరం అని అన్నారు. ద్వైపాక్షిక క్రికెట్‌ను మరింత పటిష్టంగా.. వాణిజ్యపరంగా మరింత లాభసాటిగా మార్చేందుకు బీసీసీఐ తన వంతు కృషి చేస్తుందన్నారు. 

జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ మాట్లాడుతూ.. ఈ ఏడాది తమ దేశంలో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఆకర్షణగా నిలిచే టీ20 సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వడం పట్ల తాము చాలా సంతోషిస్తున్నామన్నారు. మరోసారి జింబాబ్వే పర్యటనకు ఒప్పుకున్నందుకు ఉన్నందుకు బీసీసీఐకి తాను ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. 

హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో అన్ని మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభం అవుతాయి. జింబాబ్వేలో భారత్ మొత్తం 7 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2 సిరీస్‌లను టీమిండియా సొంతం చేసుకుంది. జింబాబ్వేతో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడడం ఇదే తొలిసారి.

==> జూలై 6న మొదటి టీ20 
==> జూలై 7న 2వ టీ20 
==> జూలై 10న 3వ టీ20
==> జూలై 13న 4వ టీ20 
==> జూలై 14న 5వ టీ20 

Also Read: Viral News: ఇదేంది సారూ... పీకల దాక తాగి స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయుడు.. వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News