CSK vs SRH vs MI: ఐపీఎల్ 2022లో ఇవాళ కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకూ ఇంకా విజయపు ఖాతా తెరవని ఆ జట్లకు ఇది కీలకం. ఎవరి బలమెంతో పరిశీలిద్దాం.
ఐపీఎల్ 2022లో ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఈ రెండు జట్లు ఇంకా విజయం ఖాతా తెరవలేదు. చెన్నై సూపర్‌కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోగా. ఎస్ఆర్హెచ్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడి..రెండింట ఓటమిపాలైంది. మరోవైపు వరుస మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన మరో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా ఆర్సీబీతో తలపడనుంది.
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఈసారి ఎందుకో చాలా పేలవమైన ప్రదర్శన ఇస్తోంది. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా నేతృత్వంలో కోల్‌కతా, లక్నో, పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఎస్ఆర్హెచ్ జట్టు పరిస్థితి కూడా ఇదే. రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటా ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. రెండు జట్లకు ఈ మ్యాచ్‌లో విజయం అవసరం. చెన్నైకు మరీ అవసరం. రెండింటి మధ్య ఇప్పటి వరకూ 16 మ్యాచ్‌లు జరగగా..12 విజయాలతో చెన్నై ఆధిపత్యాన ఉంది.
ఇక ఇవాళ జరిగే మరో కీలక మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. ముంబై ఇండియన్స్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి..మూడింట్లోనూ ఓడిపోయింది. రోహిత్ ఫామ్‌లో లేకపోవడం, జట్టు పేలవమైన ప్రదర్శన ఆ జట్టుకు మైనస్‌గా ఉన్నాయి. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఫామ్‌లో ఉండటం మాత్రం అనుకూలాంశంగా ఉంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు విజయం అత్యవసరమే అయినా..ఆర్సీబీ రెండు విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉండటం..ప్రతికూలం కానుంది.
Also read: PBKS vs GT: 2 బంతులు..12 పరుగులు, రెచ్చిపోయిన తెవాతియా, గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook