Sunil Gavaskar Feels Hardik Pandya reminds MS Dhoni in Captaincy: చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం (మే 28న) ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 ముగిసిపోవాలి. అయితే ఎడతెరిపి వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లిపోయింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షానికి కనీసం టాస్ కూడా పడలేదు. రాత్రి 11 దాటినా వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నేటికి (మే 29) వాయిదా వేశారు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచి వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. గతేడాది అరంగేట్రం చేసిన గుజరాత్.. ఇప్పటివరకూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. గుజరాత్ విజయాల వెనక ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కృషి ఎంతో ఉంది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ధ్రువీకరించాడు. కెప్టెన్సీ విషయంలో హార్దిక్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పోల్చుతూ ప్రశంసించాడు. ధోనీని హార్దిక్ గుర్తు చేస్తున్నాడన్నాడు.
ఓ క్రీడా ఛానల్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'గత ఏడాది తొలిసారి కెప్టెన్సీ చెపట్టినప్పుడు హార్దిక్ పాండ్యాపై పెద్దగా అంచనాలు ఎవరికీ లేవు. అయితే హార్దిక్ ఎంత ఉత్తేజకరమైన ఆటగాడో ఏడాది కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. హార్దిక్ జట్టులోకి తీసుకువచ్చిన ప్రశాంతత దిగ్గజం ఎంఎస్ ధోనీని గుర్తు చేస్తుంది. ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన టీమ్. ఇలాంటి పరిస్థితులే మనం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చూస్తాం. ఈ ఘనత హార్దిక్ పాండ్యాకే దక్కుతుంది’ అని అన్నాడు .
పలు సందర్భాలలో హార్దిక్ పాండ్యా కూడా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా తన కెప్టెన్ ఎంఎస్ ధోనీని పొగుడుతూనే ఉంటాడు. 'నిజంగా నేను ఎంఎస్ ధోనీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడితో మాట్లాడకుండానే కేవలం చూస్తూనే చాలా సానుకూల అంశాలు నేర్చుకోవచ్చు. నాకైతే ధోనీ బెస్ట్ ఫ్రెండ్, ప్రియమైన సోదరుడు' అంటూ ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందు హార్దిక్ అన్నాడు. ఇక ఐపీఎల్ 2023 ఫైనల్ రిజర్వ్‌డేకు కూడా వర్షం ముప్పు ఉంది. నేడు కూడా ఒక్క బంతి పాడకుంటే గుజరాత్ టైటిల్ విజేతగా నిలుస్తుంది.
Also Read: PM Kisan Yojana 2023: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.