Sanjay Manjrekar Predicts RCB beat LSG in IPL 2022 Eliminator : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా బుధవారం మరో బిగ్ ఫైట్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన టీమ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో స్టార్ ప్లేయర్స్ ఉన్న నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్లు బెంగళూరులో ఉండగా.. క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర లాంటి స్టార్లు లక్నోలో ఉన్నారు. అందుకే విజయం ఎవరిదో చెప్పడం కష్టంగానే ఉంది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు గెలుస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పారు.
ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... 'నేను బెంగుళూరుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నా. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం వారిదే. ఎందుకంటే బెంగుళూరుకు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ రికార్డు చూడండి. ప్లే ఆఫ్స్‌లో ఫాఫ్ మరింత రెచ్చిపోతాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా గేరు మార్చాడు. బెంగళూరు జట్టు కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించి మంచి ప్రదర్శన నమోదు చేయగలదు' అని అన్నారు.
ప్లేఆఫ్ గేమ్‌లలో ఫాఫ్ డుప్లెసిస్ సగటు (34.82) కొంత తక్కువగా ఉన్నా.. స్ట్రైక్ రేట్ మాత్రం 135గా ఉంది. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ కప్ కొట్టడంలో ఫాఫ్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై 59 బంతుల్లో 86 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మరోవైపు ఇక గుజరాత్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచు ద్వారా విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 54 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read: Riyan Parag-R Ashwin: రియాన్ పరాగ్.. నువ్ ఎప్పటికీ భారత జట్టులోకి రాలేవు! నువ్వు కోహ్లీవి కాదు
Aslo Read: Rudraveena Movie: మెగాస్టార్ చిరంజీవి 'రుద్రవీణ' టైటిల్‌తో కొత్త చిత్రం.. అంచనాలను అందుకుంటుందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి