భారత లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డే ఇంటర్నేషనల్స్కి గుడ్ బై చెప్పనున్నాడా ? ఇప్పుడు ధోనీ అభిమానులను అందరినీ వేధిస్తున్న సందేహం ఇదే! మంగళవారం లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే మ్యాచ్ అనంతరం ఎంపైర్ నుంచి ధోనీ బంతిని తీసుకోవడమే ఈ సందేహానికి కారణమైంది. ఎంపైర్ నుంచి ధోనీ బంతి తీసుకుంటున్న వీడియో ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందో లేదో అలా వెంటనే ధోనీ వన్డే ఇంటర్నేషనల్స్కి కూడా గుడ్ బై చెబుతున్నాడా అనే సందేహాలను వ్యక్తంచేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ధోనీ అటువంటి నిర్ణయం తీసుకోకూడదంటూ ధోనీ ఆటను చూడాలని కోరుకునే అభిమానులు విజ్ఞప్తి చేశారు.
Here's the video of the MS Dhoni taking the ball from umpires after the game. #ENGvIND pic.twitter.com/C14FwhCwfq
— Sai Kishore (@KSKishore537) July 17, 2018
ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ధోనీ పేలవమైన ప్రదర్శన కనబర్చాడంటూ కొంతమంది విమర్శించినా, అంతకన్నా ఎక్కువగా ధోనీ వన్డే ఇంటర్నేషనల్స్ నుంచి తప్పుకోకూడదు అని విజ్ఞప్తి చేసిన వారి సంఖ్యే చాలా ఎక్కువగా ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎటువంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.