జార్ఖండ్లో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిలో అందరికన్నా ముందు నిలిచాడు టీమిండియా మాజీ కెప్టేన్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.12.17 కోట్ల ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా ఆ రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వారిలో ధోనీ అగ్రభాగాన నిలిచాడు. ప్రభాత్ కబర్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ధోనీ ఇప్పటికే రూ.3 కోట్ల అడ్వాన్స్ టాక్స్ సైతం చెల్లించినట్టు తెలుస్తోంది. ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్ వి మహాలింగం మాట్లాడుతూ అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ధోనీ రూ.10.93 కోట్ల పన్ను చెల్లించారని, కాకపోతే.. ఆ ఏడాది అత్యధిక పన్ను చెల్లించిన వారిలో ధోనీ ముందు వరుసలో లేరని తెలిపారు.
టీమిండియాకు మాజీ కెప్టేన్ అయిన ధోనీ అనేక రకాల బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ సంపాదనలోనూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రీడాకారులకన్నా ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.