Cricket Facts: పాక్ తరుఫున క్రికెట్ ఆడిన ముస్లింయేతర ప్లేయర్లు వీళ్లే..! ఆ ఆటగాడి పట్ల దారుణం

Non Muslim Cricket Players In Pakistan: పాక్ జట్టు తరుఫున ఏడుగురు ముస్లింయేతర ప్లేయర్లు క్రికెట్ ఆడారు. మొత్తం ముస్లిం ప్లేయర్ల డామినేషన్ ఉంటే పాకిస్థాన్ టీమ్‌లో చోటు సంపాదించుకుని సత్తా చాటారు. వీరిలో ఇద్దరు ఆటగాళ్లు ఎక్కువ పేరు సంపాదించుకున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 20, 2023, 08:17 PM IST
Cricket Facts: పాక్ తరుఫున క్రికెట్ ఆడిన ముస్లింయేతర ప్లేయర్లు వీళ్లే..! ఆ ఆటగాడి పట్ల దారుణం

Non Muslim Cricket Players In Pakistan: మత ప్రతిపాదికన ఏర్పడిన దేశం పాకిస్థాన్. ఎక్కువ శాతం ముస్లింలే ఇక్కడ ఉంటారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కూడా అందరూ ముస్లిం ప్లేయర్లే ఉంటారు. అయితే ముస్లిం దేశమైన పాకిస్థాన్ తరుఫున హిందువులు కూడా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. డానేష్ కనేరియా వంటి స్టార్ ప్లేయర్లతో సహా ఏడుగురు ముస్లిమేతర ఆటగాళ్లు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆడారు. కానీ ముస్లిమేతర క్రికెట్ ప్లేయర్లపై వివక్ష చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఉదాహరణగా డానిష్ కనేరియాను చూపిస్తున్నారు. తాను హిందువు కావడంతో పాక్ జట్టులో తన పట్ల దారుణంగా ప్రవర్తించారని డానిష్ కనేరియా స్వయంగా వెల్లడించాడు. ముస్లింలు కాకపోయినప్పటికీ పాక్ జట్టు కోసం క్రికెట్ ఆడిన ప్లేయర్లపై ఓ లుక్కేయండి.

యూసుఫ్ యోహానా

పాకిస్థాన్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ల లిస్టులో యూసుఫ్ యోహానా పేరు కచ్చితంగా ఉంటుంది. 1998లో  కెరీర్ ఆరంభించిన యోహానా.. పాక్ జట్టు తరపున 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ముస్లిమేతర ఆటగాడిగా పాక్ జట్టులో ఎంట్రీ ఇచ్చిన యోహానా.. క్రైస్తవ మతానికి చెందినవాడు. కానీ 2004లో ఇస్లాం మతంలోకి మారాడు. తన పేరును మహమ్మద్ యూసుఫ్‌గా మార్చుకున్నాడు. 

డానిష్ కనేరియా

పాక్ క్రికెట్ జట్టుకు ఆడిన చివరి ముస్లిమేతర ఆటగాడు డానిష్ కనేరియా. 2000లో కెరీర్ ప్రారంభించిన కనేరియా.. పాకిస్థాన్ తరఫున 61 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తరువాత ఫిక్సింగ్‌లో పేరు రావడంతో కనేరియాను పాక్ జట్టు నుంచి తప్పించారు. పాక్ తరుఫున అత్యధిక టెస్టు వికెట్లు 261 తీసిన స్పిన్ బౌలర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌లో అబ్దుల్ ఖాదిర్, సక్లైన్ ముస్తాక్, ముస్తాక్ అహ్మద్‌లు వంటి సీనియర్లను గొప్ప ఆటగాళ్లుగా పరిగణిస్తారు. అయితే వీళ్లందరూ కూడా కనేరియా కంటే వెనుకే ఉన్నారు. 

అంటావో డిసౌజా

అంటావో డిసౌజా 1959లో పాక్ జట్టు తరపున క్రికెట్ ఆడాడు. భారత్‌లోని గోవాలో జన్మించిన డిసౌజా ఓ క్రిస్టియన్. తన కెరీర్‌లో కేవలం 6 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పాకిస్థాన్, కరాచీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. డిసౌజా తండ్రి 1947 విభజన తర్వాత పాకిస్థాన్‌లో స్థిరపడ్డారు. డిసౌజా ఆరు టెస్టుల్లో 17 వికెట్లు పడగొట్టాడు.

అనిల్ దల్పత్ సోన్వారియా

పాక్ జట్టు తరుఫున ఆడిన మొదట హిందూ ఆటగాడు అనిల్ దల్పత్ సోన్వారియా. ఆయన బంధువే డానిష్ కనేరియా. అనిల్ దల్పత్ సోన్వారియా 1984లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే పాక్ జట్టులో పెద్దగా పేరు తెచ్చుకోలేదు. కేవలం 9 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో 167 పరుగులు చేశాడు. 

వాలిస్ మాథియాస్ 

వాలిస్ మథియాస్ 1974లో పాకిస్థాన్ తరపున తన కెరీర్‌ను ప్రారంభించాడు. మథియాస్ క్రిస్టియన్ కాగా.. 21 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 783 రన్స్ చేశాడు. క్రిస్టియన్ మతానికి చెందిన డంకన్ షార్ప్ 1959లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కేవలం రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆంగ్లో-పాకిస్థానీ డంకన్ ఆల్బర్ట్ షార్ప్ పాకిస్థాన్ తరపున మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. సోహైల్ ఫజల్ పాక్ తరఫున రెండు వన్డేల్లో ఆడాడు. 1989-90 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో సోహైల్ ఫజల్ మూడు భారీ సిక్సర్లు బాదడంలో జట్టు స్కోరు 250 దాటింది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్లు 38 పరుగుల తేడాతో గెలుపొందింది.

Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన  

Also Read: Arshin Kulkarni: చితక్కొట్టాడు.. సిక్సర్ల వర్షం కురిపించిన అర్షిన్ కులర్ణి.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News