ODI World Cup 2023, PAK vs NED Highlights: వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై పాక్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ ఆటగాళ్లలో మహ్మద్ రిజ్వాన్ 68, షౌద్ షకీల్ 68 హాఫ్ సెంచరీలతో రాణించారు. మహ్మద్ నవాజ్ 39, షాదాబ్ ఖాన్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. అయితే పాకిస్థాన్ స్టార్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ 12, ఇమాం ఉల్ హక్ 15, కెప్టెన్ బాబర్ 5 పరుగులకే పెవిలియన్ చేరారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డే లీడే నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కోలిన్ అకెర్ మ్యాన్ రెండు వికెట్లు, ఆర్యన్ దట్, లోగాన్ బెర్క్, పాల్ వాన్ మీకెరెన్ చెరో వికెట్ తీశారు.
287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఓపెనర్లు ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్ 52, బాస్ డీ లీడే 67 పరుగులతో రాణించారు. లగాన్ వాన్ బీక్ 28 పరుగులతో పర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో నెదర్లాండ్స్ 41 ఓవర్లకే 205 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో హరిస్ రవూఫ్ మూడు వికెట్లు, హసన్ అలీ రెండు, షాహీన్ షా అఫ్రిది, ఇఫ్లికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీశారు. నెదర్లాండ్స్ ఓడిపోయినా బౌలింగ్‍లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు 67 పరుగులతో అద్భుతంగా ఆడిన బాస్ డె లీడే అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ గెలుపుతో ప్రపంచకప్‍లో పాయింట్ల ఖాతా తెరిచింది పాక్. మెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా రేపు రెండు మ్యాచులు జరగనున్నాయి. బంగ్లాదేశ్-అప్ఘానిస్థాన్, సౌతాఫ్రికా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
Also Read: ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి ముందు టీమిండియా షాక్.. డెంగ్యూకి గురైన స్టార్ ఓపెనర్
Also Read: ENG vs NZ highlights: సెంచరీల మోత మోగించిన కాన్వే, రచిన్.. ఇంగ్లండ్‌పై కివీస్ ఘన విజయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook