Wasim Akram Predicts Two Finalists: వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. హేమాహేమీలను మట్టికరిపిస్తూ.. ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ 8 విజయాలు సొంతం చేసుకుంది. సెమీస్‌కు బెర్త్ ఫిక్స్ చేసుకున్న భారత్.. ప్రపంచ కప్‌కు రెండు విజయాల దూరంలో నిలిచింది. సెమీస్, ఫైనల్ గెలిస్తే.. సొంతగడ్డమై మరోసారి విశ్వకప్‌ను ముద్దాడుతుంది. తాజాగా ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఏవో పాకిస్థాన్ దిగ్గజ మాజీ పేసర్ వసీం అక్రమ్ అంచనా వేశారు. పాకిస్థాన్ ఆటతీరు పట్ల నిరాశ వ్యక్తం చేసిన ఆయన.. తమ జట్టును ఫైనలిస్ట్‌గా పరిగణించలేదు. అయితే టీమిండియా మాత్ర కచ్చితంగా ఫైనల్‌కు చేరుకుంటుందని జోస్యం చెప్పారు. రెండో ఫైనలిస్టు విషయంలో పోటీ ఎక్కువగా ఉందని.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు బలమైన పోటీ దారులుగా ఉన్నాయన్నారు. ఈ రెండు జట్లలో ఒకటి రెండో ఫైనలిస్టుగా అడుగు పెడుతుందని అంచనా వేశారు.
పాకిస్థాన్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుదని తనకు అనిపించడం లేదని వసీం అక్రమ్ అన్నారు. ప్రస్తుతం ఇతర జట్లు ఆడుతున్న ఆటతీరుతో సంబంధం లేకుండా పాకిస్థాన్ క్రికెట్ ఆడుతోందన్నారు. పాక్ ఫైనల్ చేరుకోవడం కష్టమేనని చెప్పారు. ప్రస్తుతం టీమిండియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్ చేరుకోగా.. మరో రెండు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు రెండు స్థానాల కోసం రేసులో ఉన్నాయి.
పాకిస్థాన్ జట్టుకు ఫైనల్‌కు చేరే అవకాశం ఇంకా ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 4 గెలుపులతో పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. న్యూజిలాండ్ కూడా పాకిస్థాన్‌తో సమానంగా పాయింట్లు ఉన్నా.. నెట్‌రన్ రేట్ కాస్త ఎక్కువగా ఉండడంతో నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే.. 10 పాయింట్లకు చేరుకుంటుంది. అదే సమయంలో శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో అఫ్గానిస్థాన్ ఒక మ్యాచ్ అయినా భారీ తేడాతో ఓడిపోవాలి.
అప్పుడు పాక్ నాలుగో స్థానంతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. అప్పుడు మొదటి స్థానంలో నిలవనున్న టీమిండియాతో సెమీస్ ఆడుతుంది. ఈ సమీకరణాలు జరిగితే.. 2011 వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవుతుంది. అప్పుడు కూడా భారత్, పాక్ జట్లు సెమీ ఫైనల్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పాక్‌ను భారత్ చిత్తు చేసిన విషయం అభిమానులు ఇంకా మార్చిపోలేదు.
Also Read: Anasuya: అలా చేయకపోవడం వల్లే హీరోయిన్ కాలేకపోయా.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook