కామన్వెల్త్ గేమ్స్ 2018లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి ఛాను 48 కేజీల విభాగంలో ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 86 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్‌లో 110 కేజీలు ఎత్తి తన సత్తా చాటింది. తన సమీప పోటీదారు అమండా బ్రాడాక్ (కెనడా) మొత్తం కలిపి 173 కేజీలు ఎత్తి రజతం కైవసం చేసుకోగా.. చాను 194 కేజీలు ఎత్తి స్వర్ణం కైవసం చేసుకుంది.
గతంలో కూడా మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో పలు పతకాలను కైవసం చేసుకుంది. 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో చాను 48 కేజీల విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది. అలాగే 2016 రియో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. 2017లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్లో కూడా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది చాను.
ఈ రోజు పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకంతో భారత్‌కి తొలి పతకాన్ని అందించగా.. మీరాబాయి చాను స్వర్ణంతో తన సత్తాను చాటడం విశేషం. 8 ఆగస్టు 1994 తేదిన మణిపూర్ ఇంఫాల్‌లో జన్మించిన మీరాబాయి చాను.. ఈ సంవత్సం కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పడం గమనార్హం.
Congratulations #MirabaiChanu for #Gold! #CWG2018 #GoldCoast #ProudMoment pic.twitter.com/EgiFTDXywf
— Mary Kom (@MangteC) April 5, 2018
#CommonwealthGames2018 Live Updates: Weightlifter #MirabaiChanu wins India' first gold medal, sets new Games record https://t.co/hmQaLNVmuj #GC2018Weightlifting #GC2018 pic.twitter.com/QxbL8iL0lA
— DNA (@dna) April 5, 2018
Sheer World Class performance by our #Champion #MirabaiChanu 🥇🥇🥇in the #gc2018weightlifting Women's 48kg Finals breaking all records lose in every lift attempt. Well done #TeamMauritius #TeamSriLanka#Proud moment for #TeamIndia #GC2018 @WeightliftingIN @Ra_THORe pic.twitter.com/bSSSXU531S
— IOA - Team India (@ioaindia) April 5, 2018