Sanjay Manjrekar: టీమ్ ఇండియా సెలెక్షన్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఓటమిపై స్పందించిన సంజయ్ మంజ్రేకర్ కొంతమంది ఆటగాళ్ల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ ఇండియాకు దక్షిణాఫ్రికాలో ఘోర పరాజయం ఎదురవుతోంది. టెస్ట్ సిరీస్, ఇటు వన్డే సిరీస్ రెండింటీనీ కోల్పోయింది. తొలి వన్డేలో ఓటమి తరువాత కూడా రెండవ వన్డేలో విఫలమైంది టీమ్ ఇండియా. ముఖ్యంగా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా రాణించలేకపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. సెలెక్షన్ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ వన్డేలో రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక ఎలా జరిగిందో తనకు అర్ధం కావడం లేదని సంజయ్ మంజ్రేకర్ చెప్పాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాకు అతడు అవసరమైన స్పిన్నర్ కాదని మంజ్రేకర్ (Sanjay Manjrekar ) అభిప్రాయపడ్డాడు. అశ్విన్ ఏ కారణం లేకుండానే జట్టులోకి తిరిగి వచ్చాడని చెప్పాడు. వన్డే క్రికెట్‌లో అతడు వస్తాడనేది కనీసం అతడు కూడా ఉహించలేదన్నాడు. సెలెక్టర్ ఎందుకు ఎంపిక చేశారో తెలియడం లేదన్నాడు. ఇప్పుడతడు అవసరమైన స్పిన్నర్ కాదనే సంగతి టీమ్ ఇండియా గ్రహిస్తుందన్నాడు సంజయ్. టీమ్ ఇండియాకు (Team India)ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో వికెట్ల పడగొట్టే స్పిన్నర్లు అవసరమని చెప్పాడు. యజేంద్ర చాహల్ కూడా రాణించలేకపోతున్నాడని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. టీమ్ ఇండియా ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ సేవల్ని కోల్పోతోందని..మిడిల్ ఆర్డర్‌లో వికెట్లు పడగొట్టే సత్తా అతనికుందని సంజయ్ చెప్పాడు.
Also read: Andre Russell Run Out: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రనౌట్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook