Snake in Cricket Ground: మ్యాచ్ మధ్యలో అనుకోని అతిథి.. క్రికెట్‌ గ్రౌండ్‌లోకి పాము ఎంట్రీ..!

Lanka Premier League 2023 Snake Video: ఎల్‌పీఎల్ 2023లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సోమవారం గ్యాలె గ్లాడియేటర్స్, దంబుల్లా ఆరా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ టై అవ్వగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇక ఈ మ్యాచ్‌లో మధ్యలో పాము ఎంట్రీ ఇవ్వడంతో కాసేపు ఆటను ఆపేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 31, 2023, 08:53 PM IST
Snake in Cricket Ground: మ్యాచ్ మధ్యలో అనుకోని అతిథి.. క్రికెట్‌ గ్రౌండ్‌లోకి పాము ఎంట్రీ..!

Lanka Premier League 2023 Snake Video: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) 2023లో అనుకోని అతిథి వచ్చింది. గ్యాలె గ్లాడియేటర్స్, దంబుల్లా ఆరా జట్లు సోమవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ మధ్యలో ఓ పాము మైదానంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. దీంతో కొన్ని నిమిషాలు ఆగిపోయింది. ఆట రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత గ్రౌండ్ స్టాఫ్‌ పామును పట్టుకుని బంధించారు. అనంతరం మ్యాచ్‌ మళ్లీ ప్రారంభం అయింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

 

దంబుల్లా ఆరా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. మైదానంలో పాము కనిపించడంతో ఆటగాళ్లతోపాటు అంపైర్లు కూడా ఆశ్చర్యపోయారు. గాలే టైటాన్స్‌ తరఫున ఐదో ఓవర్‌ వేయడానికి షకీబ్‌ అల్‌ హసన్‌ వచ్చాడు. పాము స్టేడియంలోకి ప్రవేశించడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం గ్రౌండ్ సిబ్బంది పామును పట్టుకోవడంతో ఆట కొనసాగింది.

అంతకుముందు దంబుల్లా ఆరా కెప్టెన్ కుశాల్ పెరీరా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రాజపక్స (48), కెప్టెన్ దసూన్ షనకా (41 నాటౌట్) రాణించారు. అనంతరం దంబుల్లా ఆరా జట్టు కూడా 7 వికెట్ల నష్టానికి 180 పరుగులే చేసింది. ధనుంజయ డిసిల్వా (43), కుశాల్ పెరీరా (40), అలెక్స్ రాస్ (39 నాటౌట్) రాణించారు. రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. 

సూపర్ ఓవర్ నిర్వహించగా.. దంబుల్లా ఆరా జట్టు వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. అనంతరం గ్లాడియేటర్స్ జెయింట్స్‌ బ్యాట్స్‌మెన్ రాజపక్స కేవలం రెండు బంతుల్లోనే ఒక ఫోర్, సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. దసూన్ షనకాకు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

Also Read: JC Prabhakar Reddy: ఆ రోజు ఉరి వేసుకుందామనుకున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి  

Also Read: Weather Updates Today: రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News