Virat Dancing in Ground: మ్యాచ్​ మధ్యలో డ్యాన్స్ చేసిన విరాట్.. వీడియో వైరల్

భారత్ జట్టులో విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటారో మన అందరికీ తెలిసిందే.. అయితే బుధవారం అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరచాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 07:54 PM IST
  • మైదానంలో స్టెప్పులేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ
  • "మై నేమ్ ఈజ్ లఖన్" అనే సాంగ్ కు డ్యాన్స్ చేసిన విరాట్
  • డ్యాన్స్ చూసి అరిచిన విరాట్ అభిమానులు
Virat Dancing in Ground: మ్యాచ్​ మధ్యలో డ్యాన్స్ చేసిన విరాట్.. వీడియో వైరల్

Virat Kohli Dancing in India Vs Afghanistan Match: దుబాయ్ (Dubai) లో జరుగుతున్న టీ20 వరల్డ్​ కప్​లో (T20 World Cup 2021) తొలి రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలమైన జట్టు.. అఫ్గాన్​తో (Afganistan)జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచిన అప్గాన్​ను ఎదుర్కోవడం అంత సులువైన పని కాదని.. టీమ్ ఇండియా (Team India) సమష్టి కృషితో విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే!

Also Read: Samantha Shocking Decision: విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ నిర్ణయం..??

అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 210 టార్గెట్ నిర్దేశించిన సంగతి తెలిసిందే.. ఫీల్డింగ్ చేసే సమయంలో విరాట్ కోహ్లీ స్టెప్పులేసి (Virat Kohli Dance) ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది.. అవునండి జట్టులో హైపర్ యాక్టివ్ గా ఉండే విరాట్ కోహ్లీ స్టెప్పులేసి అభిమానులతో విజిల్ కొట్టించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. 

నిన్న అఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేయటానికి విరాట్ కోహ్లీ బౌండరీ వద్దకు వచ్చాడు.. అప్పుడే. హిందీలో పాపులర్ సాంగ్ "మై నేమ్ ఈజ్ లఖన్" (My Name is Lakhan) అనే సాంగ్ వస్తుంది.. ఉన్నట్టు ఉండి విరాట్ కోహ్లీ ఆ పాటకు స్టెప్పులేశాడు.. ఇక ఏముంది ఆడియన్స్ ఒక రేంజ్ లో అరిచారు.. 

Also Read: Allegation on Petro-Diesel Price: పెట్రోల్ ధర బారెడు పెంచి.. చిటికెడు తగ్గించారు.. ఇదేం న్యాయం..??

ఇదంత ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది తెగ వైరల్ అవుతుంది.. టీమిండియా కెప్టెన్ ఎలా స్టెప్పులేసి ఆటతో పాటు డ్యాన్స్ తో ఎలా అలరిచాడో మీరే ఒకసారి చూడండి. ఇపుడే కాదు 2016లో జరిగిన ప్రపంచ కప్ లోను విరాట్ కోహ్లీ మైదానంలో డ్యాన్స్ చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News