Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్‌.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించింది. కింగ్‌ కోహ్లి మాస్ట్రో ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. చరిత్ర మర్చిపోలేని గెలుపును అందించాడు. తన బ్యాటింగ్ గురించి కొన్నేళ్ల పాటు చర్చించుకునేలా చేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 11:09 AM IST
  • చివరి ఓవర్‌లో అశ్విన్‌కు కోహ్లి సలహా
  • మరో ప్లాన్‌తో భారత్‌ను గెలిపించిన అశ్విన్
  • అతని ధైర్యసాహసాలు మెచ్చుకోవచ్చు: కోహ్లి
Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్‌.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్

Virat Kohli To Ravichandran Ashwin: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించింది. కింగ్‌ కోహ్లి మాస్ట్రో ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. చరిత్ర మర్చిపోలేని గెలుపును అందించాడు. తన బ్యాటింగ్ గురించి కొన్నేళ్ల పాటు చర్చించుకునేలా చేశాడు. 

చివరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అవసరం అవ్వగా.. క్రీజ్‌లో కోహ్లి, హార్థిక్‌ పాండ్యా ఉండడంతో గెలుపు భారత్‌దేనని అందరూ అనుకున్నారు. కానీ తొలి బంతికే పాండ్యా అవ్వడంతో టీమిండియా ఫ్యాన్స్‌ కాస్త ఆందోళన చెందారు. ఆ తరువాత రెండు బంతులకు మూడు పరుగులే రావడంతో 3 బంతుల్లో 13 పరుగులుగా సమీకరణ మారిపోయింది. నాలుగో బాల్‌కు కోహ్లి సిక్స్‌ బాదగా.. అది నో బాల్‌ కావడంతో భారత్‌కు కలిసి వచ్చింది. ఫ్రీ హిట్‌కు త్రీ రన్స్‌ రావడంతో 2 బంతుల్లో 2 పరుగులు చేయాలి. అయితే ఐదో బంతికి దినేష్‌ కార్తీక్‌ ఔట్ అవ్వడంతో ఒక్కసారిగా స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది. ఇక చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. పాక్‌దే విజయమని అనుకున్నారు.

ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ఎంతో తెలివితో బ్యాటింగ్ చేశాడు. బౌలర్‌ మహ్మద్ నవాజ్‌ లెగ్ సైడ్ వైపు బంతి వేయగా.. అశ్విన్ లోపలికి జరిగాడు. దీంతో అంపైర్ వైడ్‌గా ప్రకటించారు. స్కోర్స్‌ లెవెల్ అవ్వడంతో భారత్‌ శిబిరంలో ఆనందం వెల్లివెరిసింది. చివరి బంతికి సింగిల్‌ తీసి.. టీమిండియా అద్భుత విజయంలో అశ్విన్ కూడా భాగం పంచుకున్నాడు.

లెగ్‌ సైడ్‌ వేసిన బంతిని వదిలేసినందుకు అశ్విన్‌ను కోహ్లి ప్రశంసించాడు. 'అశ్విన్‌ని కవర్‌ మీదుగా బాల్‌ కొట్టమని చెప్పాను. కానీ అశ్విన్ మైండ్‌లో ఇంకా తెలివైన ఆలోచన ఉంది. బాల్ లైన్ లోపలికి వచ్చి బంతిని వైడ్‌గా మార్చాడు.. అతనికి ధైర్యసాహసాలు మెచ్చుకోవచ్చు' అని చెప్పాడు. 

 

టీ20 క్రికెట్‌లో ఇదే తన అత్యుత్తమ ఇన్నింగ్స్ అని అన్నాడు. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. “మీరు నాకు మద్దతు ఇచ్చారు. ఇన్ని నెలలు నాపై చాలా ప్రేమను చూపించారు. మీరు నాకు అన్ని వేళల సపోర్ట్ చేశారు. మీ ప్రేమకు నేను చాలా కృతజ్ఞుడను. ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. 

Also Read: Diwali Celebrations: చీకట్లు నింపిన దీపావళి.. టపాసులు పేలి బాలుడు మృతి.. సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

Also Read: Rishi Sunak Interesting Facts: రిషి సునక్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News