Who is Shashank Singh: ఐపీఎల్ 17వ సీజన్ ద్వారా కొంత మంది యువఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా మరో భవిష్యత్తు ఆశాకిరణం పుట్టుకొచ్చింది అతడే శశాంక్ సింగ్. ఈ ఛత్తీస్ ఘడ్ కుర్రాడు ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ చారిత్రాత్మక విజయం సాధించడంలో ఈ యువ కెరటం కీలకపాత్ర పోషించాడు. కేవలం 28 బంతుల్లోనే 8 సిక్సర్లు, 2 ఫోర్లు సహాయంతో అజేయంగా 68 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 242.86గా ఉంది. అంటే ఇతడి విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన శశాంక్ సింగ్ 65.75 సగటుతో 263 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 182.63గా ఉంది.
కేకేఆర్ పై పంజాబ్ అద్భుత విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(75), సునీల్ నరైన్(71) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వెంకటేష్ అయ్యర్(39) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు మరో ఎనిమిది బంతులు ఉండగానే కొండంత లక్ష్యాన్ని ఛేదించింది. మరోసారి బెయిర్ స్టో సెంచరీతో చెలరేగాడు. అతడు కేవలం 48 బంతుల్లో ఆజేయంగా 108 పరుగులు చేశాడు. మరోవైపు యువ ఆటగాళ్లు శశాంక్ సింగ్, ప్రభు సిమ్ర(50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
అసలు ఎవరీ శశాంక్ సింగ్?
శశాంక్ సింగ్ చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జన్మించాడు. అతడి తండ్రి శైలేష్ సింగ్ ఐపీఎస్ అధికారి. శైలేష్ సింగ్ భోపాల్‌లో పనిచేస్తున్నప్పుడు తన కుమారుడిలోని క్రికెట్ ప్రతిభను గుర్తించాడు. దీంతో అతడిని కోచింగ్ కోసం ముంబై పంపాడు. 2015లో ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీల్రో శశాంక్ ఆడాడు. అయితే ముంబై తరపున పెద్దగా అవకాశాలు రాకపోవడంతో శశాంక్ తన సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లాడు.
Also read: KKR Vs PBKS Highlights: ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్
అక్కడ తన రాష్ట్రం తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 858 పరుగులు చేయడమే కాకుండా 12 వికెట్లు కూడా తీశాడు. శశాంక్ సింగ్ 30 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 41.08 సగటుతో 986 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని పేరిట 33 వికెట్లు ఉన్నాయి. 64 టీ20 మ్యాచుల్లో 987 పరుగులు చేయడమే కాకుండా శశాంక్ సింగ్ 15 వికెట్లు తీశాడు. శశాంక్ సింగ్ తన కెరీర్‌లో మొత్తం 64 టీ20లు ఆడాడు మరియు అతని స్ట్రైక్ రేట్ 145.79గా ఉంది. శశాంక్ గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడగా.. ఇప్పుడు పంజాబ్ తరుపున ఆడుతున్నాడు.
Also Read: Yuvraj Singh: టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా సిక్సర్ల కింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter