Shoaib Akhtar says If Rishabh Pant becomes a Model he Earns Crores of money: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భయం అంటే తెలియని క్రికెటర్ పంత్ అని, కొత్త షాట్లతో ప్రత్యర్థి జట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నాడు. పంత్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని అక్తర్ సూచించాడు. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కూడా అక్తర్ ఆకాశానికి ఎత్తేశాడు. ఫిట్‌నెస్‌తో పాటు మానసికంగా బలోపేతం అయ్యాడని, బాగా రాణిస్తున్నాడని పాక్ మాజీ పేసర్ పేర్కొన్నాడు.
షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ... 'రిషబ్ పంత్ భయం తెలియని క్రికెటర్. అతను కట్ షాట్, పుల్ షాట్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్ మరియు పాడిల్ స్వీప్ షాట్లు ఆడగలడు. ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టు విజయం అందించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ బాగా ఆడాడు. భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే పంత్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే భారత మార్కెట్ చాలా పెద్దది కాబట్టి.. అతడు మంచి పర్సనాలిటీతో ఉంటే మోడల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కోట్లు సంపాదించగలడు' అని అన్నాడు.
'హార్దిక్ పాండ్యాను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయడంతో టీమిండియాలో మంచి సమతూకం వస్తుంది. బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాడు. అన్‌ఫిట్‌గా ఉన్నప్పుడు దాదాపు రెండేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు. అది అతడికి మంచే చేసింది. పాండ్యాను చూస్తే ఆన్ ఫీల్డ్‌లో ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే మైదానం వెలుపల ఎక్కువగా ఎంజాయ్ చేయొద్దని నేను సూచిస్తున్నా. అతడికి ఉన్న అరుదైన టాలెంట్‌ను ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఆటపై మరింత దృష్టి పెట్టాలి' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
Also Read: Viral Video: బీరేసి 'బాహుబలి'గా మారిన కోడి.. ఏకంగా పక్షి లాగా గాల్లోకి ఎగురుతూ..!
Also Read: బ్రదర్ ప్యాడ్లు మర్చిపోయావ్.. ప్రత్యర్థి ప్లేయర్స్ చెప్పగానే డగౌట్‌కు పరుగెత్తిన బ్యాటర్!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook