ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఒక ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ఏజెన్సీకి ఆయన సంవత్సరానికి రూ.6 కోట్లు చెల్లిస్తున్నారని పలు ప్రముఖ పత్రికల్లో వార్తలు రావడం గమనార్హం
ఇరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ ఒకరు ఓటుకు నోటు కేసు గురించి ఆలోచిస్తుంటే.. మరొకరు ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఆలోచిస్తున్నారని.. ఈ క్రమంలో ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేశారని సీపీఎం జాతీయ కార్యదర్శి నారాయణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ సీఎం కేసీఆర్కు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న కేసీఆర్ ఈ విషయంపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ను కలిసి చర్చించేందుకు ఈ రోజు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు.
సింగరేణి ప్రాంతంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం శ్రీ కేసీఆర్ నేడు సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్లో జరిగినే ఈ భేటీకి సింగరేణి సీఎండీ శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) గిరిజన సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చట్టం చేసిన
క్రమంలో వివిధ తెగలకు చెందిన గిరిజనులను, గిరిజన నాయకులను సమావేశపరిచి ప్రగతిభవన్లో కేసీఆర్ వారితో మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.